వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో సత్తా చాటిన భారత్, నాల్గో స్పేస్ పవర్‌గా అవతరణ

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్‌గా భారత్ ! | Oneindia Telugu

ఢిల్లీ : అంతరిక్షంలో భారత్ సత్తా చాటింది. ప్రపంచంలో మరో స్పేస్ పవర్‌గా అవతరించింది. అంతరిక్షంలో లైవ్ శాటిలైట్ ను పేల్చివేసిన భారత్.. అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గో స్పేస్ పవర్‌గా అవతరించింది. భారత సైంటిస్టులు అంతరిక్షంలో 300కిలోమీటర్ల దూరంలో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చివేశారని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం చేసిన సైంటిస్టులకు ఆయన అభినందనలు చెప్పారు.

దేశానికి గర్వకారణం
శాటిలైట్ పేల్చివేతకు సంబంధించిన వివరాలు పంచుకునేందుకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ప్రయోగంతో నింగి, నేల, నీటితో పాటు అంతరిక్షం నుంచి జరిగే దాడులను కూడా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతమైందని చెప్పారు. ఈ ప్రయోగం ఎవరినీ భయపెట్టేందుకు చేసింది కాదని మోడీ స్పష్టం చేశారు.

శత్రుదేశాలకు హెచ్చరిక
ఎల్ఈఓ శాటిలైట్‌ను పేల్చివేయడంలో విజయం సాధించిన భారత్ శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భారతపై నిఘా పెట్టే ఇతర దేశాల శాటిలైట్లను కూల్చడంతో పాటు వారి కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది ధ్వంసం చేయనుంది.

India is Elite Space Power Now
English summary
Prime Minister Narendra Modi today announced that India had joined the elite club of space powers by shooting down a low-orbit satellite within just three minutes with an anti-satellite missile, demonstrating its technical capability. The only three other members of the space super league are US, Russia and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X