• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత్ మన హిందూ దేశం, భయపడొద్దు: ఆరెస్సెస్ చీఫ్

By Srinivas
|

కోల్‌కతా: కేంద్రం ప్రతిపాదించిన మత మార్పిడుల నిరోధక చట్టానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ మత మార్పిడులు వద్దనుకుంటే పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించడానికి సహకరించాలని ప్రతిపక్ష పార్టీలను కోరారు.

ఎవరైనా హిందూమతంలో మారడాన్ని ఇష్టపడకపోతే హిందువులను కూడా మతం మారనివ్వకూడదన్నారు. ఒక బలమైన హిందూ సమాజాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నిస్తున్నామని, దారితప్పిన వారెవరు కూడా తమ ఇష్టప్రకారం వెళ్లలేదన్నారు. వారిని ప్రలోభపెట్టడం లేదా బలవంతంగా తీసుకు వెళ్లారన్నారు.

RSS

ఒక దొంగను పట్టుకున్నప్పుడు నా ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు నేను నా ఆస్తిని తీసుకోవడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ఇది మీకు ఇష్టం లేకపోతే చట్టం తీసుకు రావాలని సవాల్ చేశారు. హిందువుగా మారడం మీకు నచ్చకపోతే హిందువులను కూడా మతం మార్చకూడదన్నారు. ఈ విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు.

హిందువులు భయపడాల్ని పని లేదన్నారు. మనం మన దేశంలో ఉన్నామని, మనమేమీ చొరబాటుదారులం కాదన్నారు. ఇది మన హిందూ రాష్ట్రమన్నారు. హిందువైనవాడు తన మాతృభూమిని వదిలిపెట్టి వెళ్లడని, గతంలో మనం కోల్పోయినదాన్ని తిరిగి వెనక్కి తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నామన్నారు.

హిందువులు చైతన్యం కావడాన్ని చూసి ఎవరు కూడా భయపడాల్సిన పని లేదన్నారు. దీనిపై గొడవ చేస్తున్న వారంతా స్వార్థపరులు, వారికి వారి సొంత ప్రయోజనాలున్నాయని ఆరోపించారు. దేశ విభజనకు ముందు పాకిస్తాన్ కూడా భారత్‌లో భాగంగా ఉండిందన్నారు.

అక్కడ హిందువులు బలంగా లేని కారణంగా పాకిస్తాన్ శాంతితో ఉండలేకపోతోందన్నారు. శనివారం కోల్‌కతాలో హిందూ సమ్మేళనంలో భగవత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలన్న భగవత్ అభిప్రాయంతో ఏకీభవించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Describing India as a Hindu rashtra and making a strong pitch for Hindu awakening, RSS chief Mohan Bhagwat on Saturday upped the ante on conversions by challenging opposition parties to bring a law for banning forcible conversions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more