వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2027 కల్లా చైనాను మించిపోనున్న భారత్ జనాభా...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

2027 కల్లా చైనాను మించిపోనున్న భారత్ జనాభా..!! || Oneindia Telugu

ఈ దశాబ్ధపు చివరి వరకు ప్రపంచంలో అధిక జనాభ కల్గిన దేశంగా భారత్ అవతరించబోతుంది. ప్రస్థుతం ప్రపంచంలో అత్యధిక జనాభ కల్గిన చైనా వెనక్కి నెట్టి 2027 కల్లా భారత్ అత్యధిక జనాభ గల దేశంగా రికార్డుకెక్కబోతున్నట్టు యూఎన్ నివేదిక వెళ్లడించింది. ఈనేపథ్యంలోనే 2050 కల్లా మరో 27 కోట్ల జనాభ పెరగనుందని నివేదిక తెలిపింది.

30 సంవత్సరాల్లో 970 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభ

30 సంవత్సరాల్లో 970 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభ

2019 కి సంబంధించి వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్టస్ ను యునైటెడ్ నేషన్‌కు చెందిన పాపులేషన్ డివిజన్ వివరాలను ప్రకటించింది. ఈనేపథ్యంలోనే రానున్న ముప్పై సంవత్సరాల్లో అనగా 2050 కల్లా మరో రెండువందల కోట్ల జనాభ పెరుగుతుందని తెలిపింది. దీంతో ప్రస్థుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 770 కోట్ల జనాభకు గాను 30 సంవత్సరాల్లో మరో రెండు వందల కోట్లు పెరిగి 970కోట్లకు చేరుతుందని తెలిపారు.

150 కోట్లకు చేరుకోనున్న భారత జనాభ

150 కోట్లకు చేరుకోనున్న భారత జనాభ

ప్రస్థుతం చైనా జనాభ 143 కోట్లు ఉండగా ఇండియా జనాభ 137 కోట్లుగా ఉంది.కాగా ప్రపంచంలో ఈ రెండు దేశాల జనాభా శాతం వరుసగా 19, 18 శాతంగా ఉంది.కాగా ఈ దశాబ్ధం చివరి వరకు చైనాను మించి భారత దేశంలో జనాభ పెరగనుంది. ఇందులో భాగాంగానే ఇండియా జనాభ 150 కోట్లకు చేరుకోగా చైనా మాత్రం 110 కోట్లకు చేరుకోనుంది. ఇక నైజీరియా 73 కోట్లకు యూఎస్ 43 కోట్ల 40 లక్షలు కాగా పాకిస్థాన్ 40 కోట్ల ముప్పై లక్షలకు చేరుకోనున్నాయి.కాగా రానున్న సంవత్సరాల్లో చైనా ఇంకా తన భర్త్ రేటును తగ్గించుకునే అవకాశాలు ఉన్నట్టు నివేదికలో పేర్కోన్నారు.

సగటు ఆయువు ప్రమాణం 77 సంవత్సరాలు

సగటు ఆయువు ప్రమాణం 77 సంవత్సరాలు

ఇక అభివృద్ది చెందుతున్న దేశాల్లో శిశు మరణల రేటు తగ్గతుండడంతోపాటు మనిషి జీవన ప్రమాణ రేటు కూడ పేరగనుంది. ఈనేపథ్యంలోనే ప్రపంచంలో సరాసరిగా ప్రతి మహిళ 2.1 శాతం పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కోనగా, ప్రస్థుతం మనిషి ఆయువు ప్రమాణ కాలం 74 సంవత్సరాలు ఉండగా అది 2050 కల్లా 77 సంవత్సరాలకు వృద్ది చేందే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

English summary
India is projected to surpass China as the world's most populous country around 2027 and will remain the most populated country through the end of the current century, according to a United Nations report. India is expected to add nearly 273 million people between now and 2050.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X