వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ప్రభుత్వానికి ఇంకా గెలుపు మత్తు దిగలేదు... ! పాకిస్థాన్

|
Google Oneindia TeluguNews

తిరుగు లేని మెజారీటితో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన భారత్‌తో స్నేహసంబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుంది.ఓవైపు పాకిస్థాన్‌లో ఆర్ధిక సంక్షోభం మరోవైపు ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య పాకిస్థాన్ ఏకాకిగా మిగిలి పోతున్న వైనం ఈ రెండింటీ నేపథ్యంలో భారత్‌తో తిరిగి స్నేహాసంబంధాలను మెరుగు పరుచుకునేందకు పాకిస్థాన్ పలు ప్రయత్నాలను చేస్తుంది. అయితే భారత్ ఇందుకు నిరాకరించడంతో భారత్ పై విమర్శలకు దిగింది.

 పుల్వామా దాడి తర్వాత స్నేహ హస్తం కోసం పాకిస్థాన్

పుల్వామా దాడి తర్వాత స్నేహ హస్తం కోసం పాకిస్థాన్


పుల్వామా దాడి పరిణామాల తర్వాత పాకిస్థాన్‌ను ఒంటరీగా మారుతోంది. ఓ వైపు ఉగ్రవాదం మరోవైపు దేశ ఆర్ధిక సంక్షోభం పాకిస్థాన్‌ను ఒంటరీ చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే భారత్‌తో ఉన్న వైరుధ్యాలను పక్కన బెట్టి స్నేహా హస్తాన్ని అందిస్తోంది.దీంతో రెండు దేశాల మధ్య స్నేహసంబంధాన్ని కొనసాగించడంతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించకునేందుకు చర్చలకు రావాలని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌కు లేఖ రాశారు.

చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీష‌న్‌: ప‌సుపు-కుంకుమ‌తో ప్ర‌భావితం చేసారు..! చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీష‌న్‌: ప‌సుపు-కుంకుమ‌తో ప్ర‌భావితం చేసారు..!

కిర్గిస్థాన్‌లో చర్చలకు సిద్దమైన పాకిస్థాన్

కిర్గిస్థాన్‌లో చర్చలకు సిద్దమైన పాకిస్థాన్

ఈనేపథ్యంలోనే కిర్గిస్థాన్‌లో కొనసాగుతున్న ఎస్‌సీఓ సమావేశాల్లోనే పాకిస్థాన్ ప్రధానితో ప్రధాని మోడీ సమావేశం అవుతారని వార్తలు వెలువడ్డాయి. కాని బిష్కేక్ సమావేశాల్లో చైనా ,రష్యాదేశాలతో సమావేశమైన మోడీ పాకి్స్థాన్‌ ప్రధానితో చర్చలు జరిపేందుకు నిరాకరించారు. మరోవైపు భారత్‌లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ తిరిగి అధికారంలో రావడం వల్లే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని స్వయంగా ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు.

కనీసం పాకిస్థాన్ ఆకాశం గుండా వెళ్లని మోడీ

కనీసం పాకిస్థాన్ ఆకాశం గుండా వెళ్లని మోడీ

ఇక తాజగా కిర్గిస్థాన్ వెళ్లిన ప్రధాని కనీసం పాకిస్థాన్ గగతలాన్ని కూడ ఉపయోగించుకునేందుకు నిరాకరించాడు. బిష్కేక్ సమావేశానికి వెళ్లడం కోసం భారత్ అధికారులు మూసిఉన్న పాక్ గగతలం గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో ఆదేశం హూటాటిన అందుకు అంగీకరించింది. బాలకోట్ ఉదంతం తర్వాత మూసివేసిన మార్గం గుండా వెళ్లేందుకు అంగీకరించారు. కాని మోడీ మాత్రం ముందుకు అనుకున్న పాకిస్థాన్ మార్గం కాదని ఇరాన్ గుండా కిర్గిస్థాన్‌ సమావేశాలకు వెళ్లారు.

భారత్‌తో స్సేహం కోసం వెంటపడేదీ లేదు.

భారత్‌తో స్సేహం కోసం వెంటపడేదీ లేదు.

అయితే భారత్‌ స్సేహహస్తం కోసం ఇంత చేసిన ప్రధాని మోడీ మాత్రం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు నిరాకరిస్తుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపిన తర్వాతే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగిస్తామని మోడీ స్సష్టం చేశాడు.
ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ భారత్ చర్యలపై ఘాటుగా స్పందించింది. భారత దేశానికి ఎన్నికల హ్యాంగోవర్ ఇంకా దిగలేదని పాకిస్థాన్
విదేశాంగ మంత్రి మహమ్మద్‌ ఖురేషీ భారత్‌పై విమర్శలకు దిగారు.భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని అనుకుంటున్నాము, భారత్ ఇలాంటీ చర్యలకు పాల్పడితే భారత్ మైత్రీ కోసం వెంపర్లాడేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
Pakistan Foreign Minister Shah Mehmood Qureshi on Friday said that India is yet to get out of their "post-election hangover" as the Indian government believe engaging with Pakistan would damage their constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X