వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు: చైనాకు భారత్ గట్టి హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనాకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని చైనా వ్యతిరేకించడంపై మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకోవడం ఆ దేశానికి అంత మంచిది కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.

Recommended Video

India-China Stand Off: చైనా.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు! - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
అంతర్గత వ్యవహారాలో జోక్యం వద్దు.. చైనాకు వార్నింగ్

అంతర్గత వ్యవహారాలో జోక్యం వద్దు.. చైనాకు వార్నింగ్

సరిహద్దు ప్రాంతంలో 44 వంతెనలను భారత్ ప్రారంభించిన నేపథ్యంలో లడఖ్‌పై చైనా అధికార ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చైనా పరిగణించబోదని, అది అక్రమమని వ్యాఖ్యానించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్నాన్ని కూడా తాము గుర్తించబోమని అన్నారు. సరిహద్దులో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో భారత్.. చైనాపై ఘాటుగా స్పందించింది. జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, ఎప్పుడూ అవి భారతదేశంలో అంతర్భాగమేనని విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత అంతర్గత వ్యవహారాలపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చి చెప్పాపరు.

ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించం.. అది చైనా అయినా..

ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించం.. అది చైనా అయినా..

భారత అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించేది లేదు.. అది చైనాకు కూడా వర్తిస్తుందని ఘాటుగా బదులిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో అంతర్భాగం. దీనిపై ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశాం. చైనా ఉన్నతసాయి చర్చలు కూడా తమ వాదనను అంగీకరించాయి. పదే పదే తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని హెచ్చరించారు.

కీలక సరిహద్దు ప్రాంతాల్లో 44 వంతెనలు

కీలక సరిహద్దు ప్రాంతాల్లో 44 వంతెనలు

పశ్చిమ, ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో 44 భారీ శాశ్వత వంతెనలను ఇటీవల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దేశానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ వంతెనల్లో జమ్మూకాశ్మీర్‌లో 10, లడఖ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌ లో 2, పంజాబ్‌లో 4, ఉత్తరాఖండ్ 8, అరుణాచల్‌ప్రదేశ్ 8, సిక్కింలో 4 ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనా మరింత రెచ్చిపోయింది. లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాలను తాము గుర్తించమని చైనా పేర్కొంది. చైనాకు భారత్ ధీటుగా బదిలిచ్చింది. భారత అంతర్గాత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది.

శాంతి చర్చలంటూనే యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా

శాంతి చర్చలంటూనే యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా

ఓ వైపు శాంతి చర్చలు జరుపుతూ, బలగాల ఉపసంహరణకు అంగీకరిస్తున్నామంటూనే.. మరోవైపు చైనా యుద్ధానికి సిద్ధమవుతుండటం గమనార్హం. రెండ్రోజుల క్రితం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైనిక బలగాలు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి కీలక పిలుపునిచ్చారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ డ్రాగన్ సైనికులకు స్పష్టం చేశాడు. ఇప్పటికే సరిహద్దు వెంట భారత్, చైనాలు భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఇప్పటికే భారత్ ప్రభుత్వం, సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

English summary
India has dismissed China’s “illegality” remark on carving out of separate Union Territory of Ladakh. In a terse response to the remark, the Ministry of External Affairs (MEA) has said China has no locus standi to comment on India's internal matters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X