వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: మూడు జోన్లుగా దేశం, 400 జిల్లాల్లో లాక్‌డౌన్ సడలించే ఛాన్స్...?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మూడురోజుల్లో ముగియనుంది. అయితే లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం చర్చకు దారితీసింది. దేశంలోని అన్ని ప్రాంతాలను మూడుజోన్లుగా విభజిస్తారు. అందులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే రెడ్ జోన్.. వైరస్ లేకుంటే గ్రీన్ జోన్‌గా ఎంపికచేస్తారు.

దేశంలో ఇప్పటికే 21 రోజులు లాక్ డౌన్ విధించినందున సడలింపు ఇవ్వాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలో 400 జిల్లాలో ఇప్పటివరకు వైరస్ ప్రభావం లేనందున అక్కడి వారికి సడలింపులు ఇవ్వాలనే ప్రతిపాదన వస్తోంది. వైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో లాక్ డౌన్ యథావిధిగా కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రం కాస్త సడలింపును ఇస్తారు.

India likely to be divided into 3 zones post lockdown

Recommended Video

Vizag Municipal Commissioner Srujana Attending Duties With One Month Baby

ఎల్లో జోన్.. ఇక్కడ పాజిటివ్ కేసులు సోకిన వారు ఎక్కువ మంది ఉంటారు. లాక్ డౌన్ లేకున్నా.. పరిస్థితిని మాత్రం నిశీతంగా గమనిస్తారు. చివరగా గ్రీన్ జోన్.. ఇక్కడ వైరస్ వ్యాప్తి ఉండనే ఉండదు. దేశంలో 400 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి లేదు. కరోనా వైరస్ సందర్భంగా జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమని మేధావులు సూచిస్తున్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి కంట్రోల్‌లో ఉంది అని వారు చెబుతున్నారు. లాక్ డౌన్ సడలించాలని వారు సూచిస్తున్నారు. దీనిపై రెండు, మూడురోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది.

English summary
nation had to be divided into three zones. The red zone would be the one with the most number of coronavirus cases and these zones would remain locked down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X