వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయంపై కేంద్రం కీలక ప్రకటన-లాక్‌డౌన్‌తో 78వేల ప్రాణాలు సేఫ్-లోక్ సభకు ఆరోగ్య మంత్రి బ్రీఫింగ్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి సంబంధించి టోటల్ కేసుల సంఖ్య 50 లక్షలకు.. మరణాల సంఖ్య లక్ష దిశగా దేశం పయనిస్తున్నది. గడిచిన వారం రోజులుగా నిత్యం లక్షకు చేరువలో కొత్త కేసులు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకొద్ది రోజుల్లోనే భారత్.. అమెరికాను నెట్టేసి మొదటి స్థానానికి చేరడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, వాస్తవంగా దేశంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని, కొవిడ్ పై పోరులో మిగతా దేశాలతో పోల్చుకుంటే మనం మెరుగైన స్థితిలోనే ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల ఏం జరిగిందో కూడా వివరించింది..

బీహార్ భగీరరథుడు లాంగి భూయాన్-ఒక్కడే 30 ఏళ్లు చమటోడ్చి,ఊరికి కాలువ-పిరమిడ్ కన్నా గొప్పదిబీహార్ భగీరరథుడు లాంగి భూయాన్-ఒక్కడే 30 ఏళ్లు చమటోడ్చి,ఊరికి కాలువ-పిరమిడ్ కన్నా గొప్పది

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం లోక్ సభలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కరోనా పరిస్థితిపై బ్రీఫింగ్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ రేటు, మరణాల రేటు భారత్ లో స్వల్పంగానే ఉందని, అదే సమయంలో రికవరీ రేటు మెరుగ్గా ఉందని చెప్పారు. కరోనాపై యుద్ధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని, రాబోయే రోజుల్లోనూ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తామని మంత్రి సెలవిచ్చారు.

India managed well on Covid-19 fight, Lockdown prevented 78,000 deaths: Health Minister briefs LS

ఇక కరోనా డేటాకు సంబంధించి..ప్రభుత్వాలు చేపట్టిన జాగ్రత్త చర్యల వల్లే ఇన్ఫెక్షన్లు ప్రతి 10 లక్షల మందిలో కేవలం 3,328గా ఉందని, మరణాల సంఖ్య ప్రతి 10 లక్షల మందికి 55గా ఉందని, అంటే, మరణాల రేటు కేవలం 1.6 శాతమేనని ఆరోగ్య మంత్రి చెప్పారు. భారీగా కేసులున్న ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్ గణాంకాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇప్పటికే 77 శాతం మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలిపారు.

మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్మూత్రంలో నీళ్లు కలిపిన నటి రాగిణి - డ్రగ్స్ కేసులో సీబీఐ, డాక్టర్లకు చుక్కలు - సంజనాతో ఫైటింగ్

కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేంద్రం చేపట్టిన దేశవ్యాప్త లాక్ డౌన్ అద్భుతమైన ఫలితాన్నిచ్చిందని ఆరోగ్య మంత్రి తెలిపారు. లాక్ డౌన్ నిర్ణయం అత్యంత సాహసోపేతమైందని, దేశవ్యాప్తంగా దానిని చేపట్టడం ద ద్వారా 14 నుంచి 29 లక్షల కేసులుల్ని నివారించగలిగామని, అదే సమయంలో 37వేల నుంచి 78 వేల మరణాలను ఆపగలిగామని చెప్పారు.

కరోనా వ్యాప్తి దేశం మొత్తం ఒకే తీరుగా లేదని, కొన్ని రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయని హర్షవర్ధన్ తెలిపారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఒడిశా, అస్సాం, కేరళ, గుజరాత్ లో లక్షకు పైబడి కేసులు వచ్చాయని గుర్తుచేశారు.

Recommended Video

షాకింగ్.. MP Sumalatha Ambareesh కు COVID-19 పాజిటివ్! || Oneindia Telugu

కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 92,071 కేసులు, 1,136 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 48,464,25 కరోనా కేసులు చేరాయి. మరణాల సంఖ్య 79,722 మంది మృతిచెందారు. సోమవారం నాటికి భారత్ లోరికవరీ రేటు 78 శాతం, మరణాల రేటు 1.64 శాతం నమోదైంది.

English summary
Speaking on the country’s fight against coronavirus, Health Minister Harsh Vardhan on Monday told Lok Sabha that the rate of infection has been low in India. He also added that nearly 77 percent of patients have recovered. Saying that India has very well managed its fight against coronavirus, the Health Minister said, "With our endeavour to manage Covid-19, India has been able to limit its cases and deaths per million to 3,328 cases per million and 55 deaths per million population respectively, which is one of the lowest in the world as compared to similarly affected countries."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X