వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ తర్వాత ఇండియా.. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్..? ప్రకటించడమే తరువాయి..

|
Google Oneindia TeluguNews

ఆక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బ్రిటన్ పర్మిషన్ అందజేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తారని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన అధికారి ఒకరు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ 2 గంటలకు సమావేశమవుతోంది. మీటింగులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అస్ట్రాజెనెకాతో భారత్‌లో సీరం ఇనిస్టిట్యూట్ టై అప్ అయిన సంగతి తెలిసిందే. సీరంకు చెందిన కోవిషిల్డ్ వ్యాక్సిన్ అత్యవసరంగా అందజేసేందుకు అనుమతి ఇవ్వాలను కోరుతోంది. దీనిపై సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు బ్రిటన్ అనుమతి ఇవ్వడం గొప్ప విషయం అని అభిప్రాయపడ్డారు. ఇదీ మిగతా సంస్థలను కూడా ఉత్సాహపరుస్తోందని వివరించారు.

 India May Approve Oxford-AstraZeneca Vaccine Today..

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు మెడిసిన్స్ అండ్ హెల్త్ కర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ బ్రిటన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీనికి వైద్యారోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆక్స్ ఫర్డ్ అందజేసిన డేటాను ఎంహెచ్‌ఆర్ఏ గత వారం పరిశీలించింది. వచ్చే వేసవి వరకు దేశంలో రోగ నిరోదక శక్తి గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు. టీకా వేసిన తర్వాత వారాల వ్యవధిలో సేఫ్ అవుతారని జనం పేర్కొన్నారు.

బ్రిటన్ 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఆర్డర్ చేసింది. మార్చి వరకు 30 మిలియన్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు సంబంధించి తుది ఫలితాలు వస్తాయని.. అస్ట్రాజెనెకా చీఫ్ పస్కల్ సొరియట్ తెలిపారు.

English summary
India is likely to grant approval to the coronavirus vaccine developed by Oxford University and AstraZeneca on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X