వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒమిక్రాన్ దడ: మూడో వేవ్ ముప్పు, ఐఎంఏ వార్నింగ్

|
Google Oneindia TeluguNews


ఒమిక్రాన్ అంటేనే యావత్ ప్రపంచం బెంబేలెత్తిపోతుంది. అంతా భయపడుతున్నారు. వైరస్ వేగంగా వ్యాపించడంతో టి మీద కునుకు లేకుండా పోతోంది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. భారతదేశంలోఒమిక్రాన్ కలకలం మొదలైంది. భవిష్యత్‌లో ఒమిక్రాన్ తీవ్రత మరింత ఉండొచ్చనే నిపుణుల హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తోంది.

ఒమిక్రాన్ వల్ల దేశంలో భారీ స్థాయిలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది. హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ అదనపు డోసును వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయాలని కోరింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు దేశంలోని కీలక రాష్ట్రాల్లో నమోదయ్యాయని.. ఇప్పటికే ఈ కేసుల సంఖ్య రెండంకెలకు చేరుకుందని చెప్పింది.

దేశంలో ఇప్పటికే 1.26 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను వేశారని, మొత్తం దేశ జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేయించుకున్నారని ఐఎంఏ తెలిపింది. వ్యాక్సిన్ వల్ల కరోనా ఇన్ఫెక్షన్ ను నిలువరించవచ్చనే విషయం ఇప్పటికే రుజువైందని చెప్పింది. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మనం పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తే ఒమిక్రాన్ ప్రభావాన్ని కూడా ఎదుర్కోవచ్చని తెలిపింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిపై ఫోకస్ పెట్టాలని తెలిపింది.

 india may have massive third wave threat

ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి మూడో డోసు వ్యాక్సిన్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది మెడికల్ అసోసియేషన్. వీరితో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వాలంది. ఒమిక్రాన్ వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదని, డెల్టా వేరియంట్ కంటే 5 నుంచి 10 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పింది.వైరస్ కట్టడికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

Recommended Video

Omicron Variant : Biological వార్‌ఫేర్‌ - Nations To Be Prepared || Oneindia Telugu

రెండేళ్లలో కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో వేరియంట్‌ బెంబేలెత్తిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో కొత్త వేరియంట్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఇది చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

English summary
india may have massive third wave threat. indian medical association warns amid omicron covid varient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X