వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే దేశం -ఒకే పన్ను విధానం ఉండచ్చు., ఒకే దేశం -ఒకే భాష సాధ్యం కాదు : జైరాం రమేష్

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో ఒకే భాషా విధానం ఎప్పటికి నిజం కాదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానం ఉండవచ్చు కాని ఒకే దేశం ఒకే భాషా అనేది ఎప్పటికి రియాలిటి కాదని అన్నారు. మరోవైపు మనమంతా ఒక దేశం,కాని పలు భాషలు ,సంస్కృతులు కల్గి ఉన్నామని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అవన్ని ఒకటి కావని అన్నారు.

ఒక దేశం-ఒక సంస్కృతి, ఒక దేశం-ఒక భాష ఉండకూడదు

ఒక దేశం-ఒక సంస్కృతి, ఒక దేశం-ఒక భాష ఉండకూడదు

విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో రమేష్ స్మారక ఉపన్యాసం ఇచ్చారు.ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తోపాటు గవర్నర్ వాజుభాయ్ వాలా కూడ హజరయ్యారు. కాగా కేంద్రమంత్రి అమిత్ షా ఉమ్మడి భాష హిందిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ సంధర్భంగా మనకు ఒక దేశం-ఒక పన్ను, ఒక దేశం-ఒక ఎన్నిక ఉండవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఒక దేశం-ఒక సంస్కృతి, ఒక దేశం-ఒక భాష ఉండకూడదు, "అంటూ కన్నడ,హిందీ,ఇంగ్లీష్ భాషల్లో కాసేపు మాట్లాడారు.

హిందీ జాతీయ భాషగా చేయలన్న అమిత్ షా

హిందీ జాతీయ భాషగా చేయలన్న అమిత్ షా

హిందీ భాషా దినోత్సవం సంధర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా ఒకే దేశం,ఒకే భాష అంటూ ఆయన ప్రకటన చేయడంతో హిందీని జాతీయ భాషగా చేయాలనే ఆలోచనను ఆయన ప్రకటించాడు. దేశం మొత్తానికి హిందీ బాష ఉండాలని, అదేవిధంగా మెజారీటీ ప్రజలు మాట్లాడే హిందీ భాష దేశం మొత్తాన్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కోన్నాడు. ఇలా హిందీ భాషతోనే గాందీ, పటేళ్లు కళలు కన్న ఓకే స్వప్నాన్ని నిజం చేసేందుకు అందరు హిందీ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

అమిత్ షా ప్రకటన తర్వాత ముఖ్యంగా దక్షినాదీ రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున విమర్శించారు.హిందీ జాతీయ బాష అంటూ అమిత్ షా అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ బాషల హిందీ కూ ఒక బాష అంటూ మండిపడ్డారు.ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న కేరళ సీఎం పినరయి విజయన్ సైతం అమిత్ షా ప్రకటనను వ్యతిరేకించారు. ఆయన చేసిన ప్రకటన మరో బాషపరమైన యుద్దానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.

English summary
we may have one nation-one tax, but one nation-one language will never be a reality...we are one nation- we are many languages, we are one nation- many countries,” Congress leader Jairam Ramesh on Sunday said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X