వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శీతాకాలంలో మరోసారి విజృంభించనున్న కరోనా: ఇందుకు దేశం సిద్దం కావాలన్న డాక్టర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకునే చర్యల్లో కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం ప్రణాళికలు, కంటైన్మెంట్, కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో గులేరియా తన వంతు పాత్ర పోషించారు.

భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..భారత్‌లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..

కరోనాతోనే జీవించాలి..

కరోనాతోనే జీవించాలి..

మనం కొంత కాలంపాటు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. వచ్చే శీతాకాలంలో భారతదేశంలో కరోనావైరస్ రెండోసారి విజృంభించే అవకాశం ఉందని అన్నారు. దాదాపు ఏడాదిపాటు కరోనా మహమ్మారితో మనం పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు.

హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి..

హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి..

దేశంలోని హాట్‌స్పాట్లలో కరోనా కేసులను తగ్గించడంపై డాక్టర్ గులేరియా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకే ఆలోచనను అన్ని ప్రాంతాల్లో అమలు చేయడం కుదరదని అన్నారు. హాట్ స్పాట్లను దగ్గర్నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల పాత్ర కనిపించడం లేదే..

ప్రైవేటు ఆస్పత్రుల పాత్ర కనిపించడం లేదే..


దేశంలో కరోనా మహమ్మారిని సమీక్షించేందుకు, పర్యవేక్షించేందుకు ఏర్పాటైన ఉన్నతస్థాయి అధికారుల కోర్ టీంలో డాక్టర్ గులేరియా ఒకరు కావడం గమనార్హం. బహిరంగ ప్రాంతాల్లో గుంపులుగా తిరగడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని అన్నారు కరోనా పోరాటంలో ప్రైవేటు రంగం కూడ తమవంతుగా త్ర పోషించాలని పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్ ఎత్తివేస్తే భారీగా కేసులు.. సిద్ధంగా కావాల్సిందే..

లాక్‌డౌన్ ఎత్తివేస్తే భారీగా కేసులు.. సిద్ధంగా కావాల్సిందే..

కరోనా పోరాటంలో ప్రైవేటు ఆస్పత్రుల పాత్ర ఎక్కడా కనిపించడం లేదని గులేరియా వ్యాఖ్యానించారు. గులేరయా . దేశంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత శీతాకాలంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బెడ్స్, పారామెడికల్ సిబ్బంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేయాలన్నారు. కాగా, ఇండియాలో ఇప్పటికే 46,605 కేసులు నమోదు కాగా, 12,948 మంది కోలుకున్నారు. 1,573 మంది మరణించారు. 32,080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

English summary
India may see a second spike in Covid-19 cases in winter: AIIMS Dr Guleria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X