వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ అంటే వాణిజ్యం: మోడీ, అక్కడ చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉద్యోగాల కల్పనపై దృష్టి పెడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు చెందిన 60 మంది సిఈవోలకు భారత్ అభివృద్ధి పథంలో పయనిస్తున్న విధానాన్ని వివరించారు.

రాత్రి పూట విందుకు ముందు ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) వార్షిక సదస్సుకు భారత్‌కు సాదర స్వాగతం లభిస్తుంది.

India means business: Modi tells top CEOs with eye on job creation

స్వాగత కార్యక్రమంలో రైల్వే మంత్రి పియూష్ గోయల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహర్ పాల్గొన్నారు.

గత 20 ఏళ్ల కాలంలో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు హాజరైన తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం. భారత్ నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సమావేశం యావత్తూ భారత్ వేదిక సదస్సు సందర్భంగా భారత్ యోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

సోమవారం ఉదయం మోడీ జురిచ్ చేరుకున్నారు. స్విస్ అధ్యక్షుు అలైన్ బెర్సెట్‌తో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఐదు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సదస్సులో 3 వేల మంది ప్రపంచ నేతలు పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జర్మన్ చాన్సలర్ అంజెలా మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యూయెల్ మాక్రోన్, యుకె ప్రధాని థెరెసా సదస్సులో పాల్గొంటున్నారు.

English summary
With an eye on job creation, Prime Minister Narendra Modi narrated India's growth story to 60 CEOs from top global firms on Monday. India means business, said the Prime Minister while addressing a roundtable before a dinner meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X