• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆఫ్ఘన్ పౌరులకు భారత్ ఆశ్రయం-కేంద్రం మల్లగుల్లాలు-అడ్డంకిగా ఎన్నార్సీ, వలసదారుల నిబంధనలు

|
Google Oneindia TeluguNews

తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘనిస్తాన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇతర దేశాలకు వలసపోతున్న అక్కడి పౌరులకు ఆశ్రయం ఇచ్చే విషయంలో పలు దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఇప్పటికే అందరి కంటే ముందుగా బ్రిటన్ వారికి ఎలాంటి పాస్ పోర్టు లేకుండా వచ్చి ఆశ్రయం పొందేందుకు వీలు కల్పించింది. దీంతో బ్రిటన్ కంటే ఆప్ఘన్ కు మిత్రదేశం అయిన భారత్ ఈ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందన్న చర్చ మొదలైంది. ఆప్ఘన్ పౌరులకు కేవలం ప్రత్యేక వీసాలు జారీ చేయడం మినహా ఆశ్రయంపై ఎలాంటి హామీ ఇవ్వలేకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.

Talibans enjoying | Future of Afghanistan in Amusement Park | Video Viral | Oneindia Telugu
 ఆప్ఘన్ సంక్షోభంలో భారత్

ఆప్ఘన్ సంక్షోభంలో భారత్

నిన్న మొన్నటివరకూ ఆప్ఘనిస్తాన్ ను వ్యూహత్మక మిత్రదేశంగా పరిగణించిన వేల కోట్ల సాయం చేసిన భారత్ ఇప్పుడు ఆ దేశంలో తాలిబన్ల ఆక్రమణతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పౌరుల్ని ఆదుకునే విషయంలోనూ ముందుకొస్తోంది. ఇప్పటికే అక్కడి పౌరుల్ని కాబూల్ దాటించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇదే కోవలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పంపడంతో పాటు ఇతర చర్యల కోసం ప్రయత్నిస్తోంది. ఆప్ఘన్ లో చిక్కుకున్న భారత ఎంబసీ అధికారుల్ని ముందుగా అక్కడి నుంచి తీసుకొచ్చిన కేంద్రం.. ఇప్పుడు అక్కడి పౌరులపై దృష్టిసారిస్తోంది. తద్వారా వారికి అండగా ఉంటామన్న సందేశాన్ని పంపుతోంది.

 ఆప్ఘన్ పౌరులకు ప్రత్యేక వీసా

ఆప్ఘన్ పౌరులకు ప్రత్యేక వీసా

ఇప్పటివరకూ ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వంతో వ్యూహత్మక దౌత్య, వాణిజ్య సంబంధాలు నెరిపిన భారత్.. ఇప్పుడు కష్టకాలంలో అక్కడి పౌరుల్ని ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం అక్కడి పౌరులు సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ వీసాల్ని జారీ చేస్తోంది. ఈ ప్రత్యేక వీసాలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జారీ చేస్తుండటంతో ఎలాంటి ఆలస్యం లేకుండా అక్కడి పౌరులు భారత్ కు చేరుకునేందుకు అవకాశం దక్కనుంది. ఈ ప్రత్యేక వీసాల జారీలోనూ ఇబ్బందులు తలెత్తకుండా రాయబార కార్యాలయ అధికారుల్ని భారత్ నియమించింది.

 ఆశ్రయంపై కేంద్రం మల్లగుల్లాలు

ఆశ్రయంపై కేంద్రం మల్లగుల్లాలు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో కాబూల్ లో చిక్కుకుపోయిన వారిని బయటపడేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న భారత్.. ఆప్ఘన్ పౌరులకు తమ దేశంలో ఆశ్రయం ఇచ్చే విషయంపై మాత్రం మౌనం వహిస్తోంది. ఆప్ఘన్ పౌరులకు వీసా ఇచ్చి భారత్ కు రప్పించడం సులువే అయినా ఆ తర్వాత వారి పరిస్ధితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇలా ఆప్ఘన్ నుంచి వచ్చిన వలసదారుల్ని ఆదుకునేందుకు భారత్ లో ప్రస్తుతం ఉన్న పౌరసత్వ చట్టం, వలసదారుల విధానం అనుమతిస్తాయా అన్నది ప్రశ్నార్దకంగా మారింది. దీంతో ఈ విషయంపై వెంటనే హామీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.

 అడ్డంకిగా ఎన్నార్సీ, వలస నిబంధనలు

అడ్డంకిగా ఎన్నార్సీ, వలస నిబంధనలు

గతంలో భారత్ కు వచ్చే వలసదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. కేవలం ఉపఖండంలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే మైనార్టీలను మాత్రమే దేశంలోకి అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు ఆప్ఘన్ నుంచి భారత్ వచ్చేవారు మైనార్టీలు కాదు. అక్కడ మెజారిటీగా ఉన్న ముస్లింలు మాత్రమే. కాబట్టి వారిని ఆదుకునే విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్దితి. కేవలం ఆప్ఘనిస్తాన్ పౌరుల కోసం నిబంధనలు సడలిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. అలాగే ఎన్నార్సీ నిబంధనల ప్రకారం చూసినా ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చే పౌరులు నిషేధిత వలసదారులే అవుతారు. దీంతో ఇప్పుడు కేంద్రం ఇరుకునపడింది.

 బ్రిటన్ తరహాలో ఆశ్రయం ఇవ్వలేరా

బ్రిటన్ తరహాలో ఆశ్రయం ఇవ్వలేరా

తాజాగా ఆప్ఘనిస్తాన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న అక్కడి పౌరులకు తమ దేశానికి రావాల్సిందిగా బ్రిటన్ ఆహ్వానం పలుకుతోంది. నిన్న మొన్నటి వరకూ ఆప్ఘన్ కు కాపలా కాసిన బ్రిటన్ .. ఇప్పుడు అక్కడి పౌరుల్ని ఆదుకునేందుకు ఏకంగా వేల కొద్దీ సైన్యాన్ని సైతం పంపుతోంది. అలాగే ఎలాంటి పాస్ పోర్టు లేకుండానే ఆప్ఘన్ పౌరుల్ని బ్రిటన్ లోకి వాయు, భూ మార్గాల్లో అనుమతించాలని సాహసోపేత నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో ఆప్ఘన్ పౌరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రిటన్ లోకి రావడంతో పాటు అక్కడే నివసించేందుకు సైతం వీలు కలుగుతోంది. కానీ భారత్ సహా మిగతా దేశాలు ఈ తరహా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాయి.

 ఆప్ఘన్ పౌరుల ఆశ్రయానికి డిమాండ్లు

ఆప్ఘన్ పౌరుల ఆశ్రయానికి డిమాండ్లు

ఆప్ఘనిస్తాన్ పౌరులకు ఆశ్రయం ఇచ్చే విషయంలో భారత్ కొన్ని పట్టు విడుపులు ప్రదర్శించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకూ భారత్ అంతర్జాతీయంగా ఎలాంటి వలసదారుల ఒప్పందాలపైనా సంతకాలు చేయలేదు. అలాగే 1979 నుంచీ ఆప్ఘన్ వలసదారుల్ని భారత్ అక్కున చేర్చుకుంటోంది. ఆప్ఘన్ తో ఇప్పటివరకూ దౌత్య, వాణిజ్య సంబంధాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆప్ఘన్ పౌరుల్ని ఆదుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి మన దేశంలో ఉన్న చట్టపరమైన నిబంధనలేమీ అడ్డుకాబోవని నిపుణులు చెప్తున్నారు.

 ఆప్ఘన్ పై భారత్ ప్రేమకు పరీక్ష ?

ఆప్ఘన్ పై భారత్ ప్రేమకు పరీక్ష ?

భారత ఉపఖండంలో వ్యూహాత్మక దేశమైన ఆప్ఘనిస్తాన్ విషయంలో రెండు దశబ్దాల క్రితం జోక్యం చేసుకోవడం మొదలుపెట్టిన మన దేశం ఇప్పటివరకూ భారీ ఎత్తున సాయం చేసింది. ఆప్ఘన్ కు పార్లెమంటు కట్టివ్వడమే కాకుండా అక్కడ రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. స్వయంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా కేంద్రం మాత్రం ఆప్ఘన్ విషయంలో మాత్రం భారీ ఖర్చుకు వెనుకాడలేదు. ఇప్పుడు తాలిబన్ల ఆక్రమణతో ఆప్ఘన్ లో తాము పెట్టిన పెట్టుబడి అంతా వృథా పోతుండటంతో కేంద్రానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం అక్కడి పౌరుల్ని అయినా ఆదుకుందామంటే తాము గతంలో మార్చిన నిబంధనలే అడ్డంకిగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఆ నిబంధనల్ని ఆప్ఘన్ పౌరుల కోసం సవరించలేక, అలాగని వారిని కష్టకాలంలో వదిలేయలేక కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది.

English summary
after central govt's decision on issue of electronic visa to afghan nationals, now questions over giving assylum to them also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X