వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:పేదల కోసం రూ.65 వేల కోట్లు, రాహుల్‌ గాంధీతో రఘురాం రాజన్ ఏం చెప్పారంటే...?

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ వల్ల పేదలు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకునేందుకు దేశానికి రూ.65 వేల కోట్లు కావాలని మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్ధికవేత్త రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. పేదల కోసం వెచ్చించే మొత్తం ఎక్కువ కాదు అని.. ఆ నగదుతో పేదల ప్రాణాలను కాపాడొచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రఘురాం రాజన్ ఇంటరాక్ట్ అయ్యారు. వారిద్దరూ మాట్లాడిన అంశాలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. రఘురాం రాజన్ లింక్ డిన్‌లో పోస్ట్ చేశారు.

లాక్‌డౌన్ ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి సద్దుమణిగితే ఎత్తివేయడమే మేలు అని తెలిపారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్న సమయంలో పేదలకు రేషన్, నగదును ప్రభుత్వం అందించలేదు అని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ఎంతమొత్తంలో నగదు అవసరం అవుతుంది అని రాహుల్ గాంధీ రఘురాం రాజన్‌ను అడగగా.. రూ.65 వేల కోట్ల అవసరం అవుతాయని తెలిపారు.

India Needs Budget of Rs 65,000 Cr to Help Poor Tide Over Lockdown

Recommended Video

:Lockdown :Considerable Relaxation From Lockdown For Many Districts From May 4

కాంగ్రెస్ అధ్యక్ష పదవీ నుంచి దూరమయ్యాక దేశంలోని పేదల సమస్య గురించి ఆర్థికవేత్త రఘురాం రాజన్ రాహుల్ గాంధీ తొలిసారి సమావేశమయ్యారు. తర్వాత మేధావులతో కూడా ఇంటరాక్ట్ అవుతారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ సమస్యలపై 11 మంది సభ్యులతో కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసింది. దీనికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు.

English summary
The government will need around Rs 65,000 crore to help the poor who are bearing the brunt of the coronavirus lockdown, economist Raghuram Rajan told Rahul Gandhi in a video interaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X