వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత మిలటరీ పీఓకేలో దాడులకు కుట్ర చేస్తోంది , సైన్యం చేయబోయో ప్రతి చర్య మాకు తెలుసు: ఇమ్రాన్ ఖాన్

|
Google Oneindia TeluguNews

భారత మిలటరీ పీఓకేలో చేపట్టబోయో ప్రతి వ్యూహం పాకిస్థాన్ ఆర్మికి సమాచారం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈనేపథ్యంలోనే భారత దేశ ఆర్మీ పీఓకేలో దాడి చేసేందుకు కుట్ర పన్నతుందని ఆరోపణలు చేశారు. కశ్మీర్‌లో కొనసాగుతున్న నిర్భంధం నుండి ప్రపంచ దృష్టిని మరల్చేందుకే పివోకేలో దాడులు చేసేందుకు భారత సైన్యం సన్నద్దమైందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ అసెంబ్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇమ్రాన్‌ ప్రసంగించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం పాక్ అక్రమిత కశ్మీర్‌లో దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని అన్నారు. అయితే వీటిని పాకిస్థాన్ సైన్యం ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉందని అన్నారు. దాడులకు సంబంధించి పక్క సమాచారం పాకిస్థాన్ ఆర్మి వద్ద ఉందని అన్నారు. అయితే దాడులపై తాము అప్రమత్తంగా ఉన్నట్టు కూడ ప్రకటించారు.

India of planning military action in Pakistan-occupied Kashmir:Imaran khan

ఈ నేపథ్యంలోనే భారత దేశం ఒక అడుగు ముందుకు వేస్తే తాము రెండు అడుగులు ముందుకు వేస్తామని అన్నారు.భారత దేశంపై యుద్దానికి వెళ్తాం సిద్దంగా ఉండండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చాడు. కశ్మీర్ ప్రజల స్వాతంత్ర్యం కోసం పాకిస్థాన్ సిద్దంగా ఉందని ప్రకటించాడు. కాగా ఇదివరకే ఓసారి కశ్మీర్ పరిణామాలపై మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ భారత్ ‌తో యుద్దం తప్పదని హెచ్చరించారు.కశ్మీర్ అంశాన్ని ప్రతి సంధర్భంలో కూడ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని వివరించిన ఆయన భారత దేశంలో నివసిస్తున్న 18 కోట్ల ముస్లిం ప్రజలు బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలతో భయాందోళనలో ఉంటున్నారని అన్నారు.

English summary
India of planning military action in Pakistan-occupied Kashmir. “The Pakistani army has solid information that they are planning to do something in Pakistani Kashmir,Khan said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X