వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదపు అంచున భారత్..!49రోజుల లాక్‌డౌన్ అందించిన బహుమతి అదేనా..? వైద్య నిపుణులు చెప్తుందేంటి..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : భారతదేశంలో కరోన వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని, దేశం మొత్తం ఆంక్షలు పెట్టడం సబబు కాదని, కరోనా ప్రభావం తక్కువగా ఉన్న ప్రదేశాలను జోన్లుగా విభజించి కొంత వెసులు బాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగానే కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించి కొన్ని మినహాయింపులను ప్రకటించాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సమస్య మళ్లీ ఇక్కడే తీవ్ర రూపం దాల్చినట్టు తెలుస్తోంది. అంతా సర్ధుకుందని భావించిన వేళ కరోనా మహమ్మారి మరొక్కసారి విరుచుకుపడింది.

కరోనా విలయం: చైనాలో మళ్లీ కల్లోలం.. వెల్లువలా 'సెకండ్ వేవ్’.. వైరస్ పుట్టిన వూహాన్‌లోనూ..కరోనా విలయం: చైనాలో మళ్లీ కల్లోలం.. వెల్లువలా 'సెకండ్ వేవ్’.. వైరస్ పుట్టిన వూహాన్‌లోనూ..

 భారత్ లో కరోనా విజృంభణ.. నాలుగో స్దానానికి ఎగబాకిన భారత్..

భారత్ లో కరోనా విజృంభణ.. నాలుగో స్దానానికి ఎగబాకిన భారత్..

చైనా నుండి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ అమెరికా, ఇటలీలో వ్యాప్తి చెందేనాటికి చురుగ్గా ఉందని, భారతదేశం వచ్చేసరికి చురుకుదనం దగ్గిందని, మరి కొన్ని రోజుల్లో ఇదే వైరస్ ఆక్టివ్ గా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో అదే జరుగతోందా.? నిద్రావస్థలో ఉన్న కరోనా వైరస్ ఒక్కసారిగా రెచ్చిపోనుందా..? వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు అందుకు నిదర్శనమేనా అనే సందేహాలు కలిగుతున్నాయి. ఒక్కసారిగా స్తబ్దుగా మారుతున్న వైరస్ ఉన్నట్టుండి తన కదలికల్లో వేగం పెంచుతుందనే అనుమానాలను వైద్యులు వ్యక్తం చేస్తున్నారు.

 దాదాపు 50రోజులుగా ఆంక్షలు అమలు.. ఫలితం మాత్రం శూన్యం..

దాదాపు 50రోజులుగా ఆంక్షలు అమలు.. ఫలితం మాత్రం శూన్యం..

అంతే కాకుండా ప్రపంచ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని సభ్యదేశాలు ప్రశంసించే తరుణంలో ప్రపంచంలో కరోనా ఉదృతి దేశాల్లో నాలుగో దేశంగా గుర్తించబడడం ఆందోళనకరంగా మారింది. దీంతో గత 49రోజులుగా అమలు చేస్తున్నలాక్‌డౌన్ ఆంక్షలు భారత దేశానికి ఏమిచ్చిందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే లాక్ డౌన్ విధించడంలో భారతదేశం శరవేగంగా నిర్ణయం తీసుకుని, సభ్య దేశాల ప్రసంశలు పొందింది. అదే సమయంలో లాక్‌డౌన్ ఆంక్షలను సద్వినియోగం చేసుకోవడంలో ఘోరంగా విఫలమైందని తాజా కేసులు నిర్ధారిస్తున్నాయి.

 మహారాష్ట్రలో కరోనా మృదంగం.. కుదేలవుతోన్న దేశ ఆర్దిక నగరం..

మహారాష్ట్రలో కరోనా మృదంగం.. కుదేలవుతోన్న దేశ ఆర్దిక నగరం..

లాక్‌డౌన్ ఆంక్షల్లోనే మహారాష్ట్రలో 20 వేల కేసులు నమోదయ్యాయి. రోజుకు వెయ్యి చొప్పున కేసులు నమోదు కావడం శోచనీయంగా మారింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేననే చర్చ కూడా జరుగుతోంది. లాక్‌డౌన్ అమలు చేసే సమయానికి అక్కడ కొందరికి వైరస్ సోకిందనుకుంటే ఆ కేసులన్నీ ఏప్రిల్ 14 నాటికి బయటపడాలి. కానీ మే 14 నాటికి కూడా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయంటే, లాక్‌డౌన్ ఆంక్షల అమలులో మహారాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించి ఉండిఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. దేశ ఆర్థిక రాజధానిలో పరిస్థితి ఇంత శృతి మించే వరకు కేంద్రం చోద్యం చూడటం సరైనది కాదనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.

Recommended Video

Domestic Flights May Resume By May 18, Aarogya Setu App Is Mandatory For Passengers
 భారత్ లో నిద్రావస్థలో వైరస్.. ఆక్టీవ్ మోడ్ లోకి వస్తే ప్రమాదమంటున్న వైద్య నిపుణులు..

భారత్ లో నిద్రావస్థలో వైరస్.. ఆక్టీవ్ మోడ్ లోకి వస్తే ప్రమాదమంటున్న వైద్య నిపుణులు..

ఇదిలా ఉండగా ప్రపంచంలో కరోనా కేసుల్లో భారతదేశం ఓ కొత్త రికార్డు నమోదు చేసింది. కొత్త కేసుల నమోదులో 4వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత పరిస్థితి వరకు ప్రపంచంలో మొత్తం కేసులు 42 లక్షలు, అమెరికాలో మొత్తం కేసులు 13 లక్షలు కాగా, కొత్త కేసులు 20 వేలుగా నమోదయ్యాయి. రష్యాలో మొత్తం కేసులు 2.20 వేలు - కొత్త కేసులు 11 వేలుగా నమోదయ్యాయి. బ్రెజిల్ లో మొత్తం కేసులు 1.62 వేలు కాగా కొత్త కేసులు 6600 గా నిర్ధిరణ జరిగింది. ఇక భారత దేశంలో మొత్తం కేసులు 67వేలు కాగా కొత్త కేసులు 4353 నిర్ధారణ జరిగింది. మొదట్లో చాలా పరిమిత సంఖ్యగా నమోదవుతున్న కేసుల తీవ్రత సరిగ్గా 100 రోజుల్లో రోజుకి 4 వేలకు చేరింది. దీంతో ఎంతో వేగంగా కరోనా భారతదేశంలో విస్తరిస్తుందనే అంశం అర్థమవుతోంది. అంతే కాకుండా అత్యధిక కేసులు నమోదయ్యే దేశాల్లో భారత్ 4వ స్థానంలో నిలవడం కచ్చితంగా ప్రమాదకర పరిణామాలనే చర్చ జరుగుతోంది.

English summary
India has set a new record for corona cases in the world. Jumped to No. 4 in the list of new cases. To date, the total number of cases in the world is 42 lakhs. The severity of cases, which were initially reported as very limited, reached exactly 4 thousand per day in 100 days. This means that the corona is expanding very rapidly in India. Moreover, India is ranked 4th in the country with the highest number of cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X