వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సియాచిన్ గ్లేసియర్. పర్యాటకులు, పర్వాతారోహల స్వర్గధామం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా సరే.. సియాచిన్ గ్లేసియర్ అంచులను ముద్దాడాలని కలలు కంటుంటారు. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ భూమిగా దీన్ని పరిగణిస్తుంటారు. ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) మధ్య ఉండే ఓ చిన్న ప్రదేశం ఇది. వ్యూహాత్మకంగా భారత సైన్యానికి అత్యంత కీలకమైనది కూడా. కార్గిల్ యుద్ధ సమయంలో సియాచన్ గ్లేసియర్ పాత్ర చాలా ఉంది. ఆకాశాన్నంటే హిమాలయ పర్వత పంక్తుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో కొద్దిరోజుల కిందటే సుమారు 130 టన్నుల చెత్తను ఏరివేశారు జవాన్లు.

ఎంత అందమైనదో..అంతే ప్రమాదకరమైనది..

ఎంత అందమైనదో..అంతే ప్రమాదకరమైనది..

ఎంత అందమైనదో.. అంతే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే- తరచూ ఇక్కడ మంచు తుఫాన్లు సంభవిస్తుంటాయి. గంటకోసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఏదో మట్టి పెళ్లల తరహాలో మంచు చరియలు విరిగి పడుతుంటాయి. దీన్నే అవలాంచ్ అంటుంటారు. అలాంటి సియాచిన్ గ్లేసియర్.. పర్వతారోహకులు, సాహస యాత్రికులు, పర్యాటకులకు రారమ్మని పిలుస్తోంది. సియాచిన్ గ్లేసియర్ లో పర్యాటకులకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సోమవారం వెల్లడించారు.

కాశ్మీర్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా..

కాశ్మీర్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా..

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత.. అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం. పారిశ్రామికంగా, మౌలిక సదుపాయాల కల్పన పరంగా పెద్దగా సౌకర్యాలు లేని జమ్మూ కాశ్మీర్ కు పర్యాటక రంగం ఒక్కటే ప్రధాన ఆదాయ వనరు. అందుకే- ఆ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే.. సియాచిన్ గ్లేసియర్ ను సందర్శించడానికి పర్యాటకులకు అనుమతి ఇచ్చిందని అంటున్నారు.

లడక్ కు పర్యాటకుల తాకిడి..

లడక్ కు పర్యాటకుల తాకిడి..

సియాచిన్ గ్లేసియర్ ప్రాంతాన్ని పర్యాటకుల సందర్శన కోసం తెరవడం వల్ల లడక్ భారీగా లబ్ది పొందుతుంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే లడక్ గుండా రాకపోకలను సాగించాల్సి ఉంటుంది. ఫలితంగా- అక్కడ రోడ్లు, హోటళ్లు, పర్యాటక రంగానితో ముడిపడి ఉన్న మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి ఎత్తయిన కుమార్ పోస్ట్ వరకూ వెళ్లడానికి కేంద్రం ప్రభుత్వం పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. ఎప్పటి నుంచో సియాచిన్ గ్లేసియర్ ను సందర్శించాలని భావిస్తోన్న పర్యాటకులకు ఈ నిర్ణయం ఓ వరంలా మారింది.

ఎంపిక చేసిన జర్నలిస్టులు, కొందరు కూలీలకు మాత్రమే ఇప్పటిదాకా ఛాన్స్

ఎంపిక చేసిన జర్నలిస్టులు, కొందరు కూలీలకు మాత్రమే ఇప్పటిదాకా ఛాన్స్

ఇప్పటిదాకా సియాచిన్ గ్లేసియర్ ను స్థానికులు కూడా సందర్శించలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. లడక్ గానీ, చుట్టు పక్కల గ్రామాల వారు గానీ సియాచిన్ ప్రాంతాన్ని సందర్శించలేదు. కారణం- ఆర్మీ. రెండు వివాదాస్పద దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో ఉంచుకుంది సైన్యం. సాధారణ ప్రజలకు కూడా ఇక్కడికి రాకపోకలు కల్పించే అవకాశం ఇవ్వలేదు. సైన్యానికి అవసరమైన సామాగ్రిని చేరవేయడానికి ఎంపిక చేసిన కొందరు కూలీలు, ఆర్మీ సన్నాహకాలను కవర్ చేయడానికి కొందరు జర్నలిస్టులకు మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇక ఎవ్వరైనా సియాచిన్ ను సందర్శించడానికి అవకాశం ఏర్పడింది.

English summary
Adventure enthusiasts can now boast of visiting the highest battlefield in the world. Defence Minister Rajnath Singh on Monday, 21 October, announced that the Siachen area will be opened for tourism purposes. “Ladakh has tremendous potential in Tourism. Better connectivity in Ladakh would certainly bring tourists in large numbers. The Siachen area is now open for tourists and Tourism. From Siachen Base Camp to Kumar Post, the entire area has been opened for Tourism purposes,” Singh tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X