వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్‌పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్‌లోని కర్తార్‌పూర్ ప్రాంతంలో ఉన్న చరిత్రాత్మక గురుద్వార్‌ దర్బార్‌కు భారతీయులను అనుమతించే అంశంపై చర్చించేందుకు రెండు దేశాల అధికారులు సమావేశం కానున్నారు. ఇరు దేశాల హోం, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

<strong>భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?</strong>భారత్ సర్జికల్ స్ట్రైక్స్ దెబ్బ: నౌకాశ్రయాలను వదిలి వెళ్లిన పాక్ నావికాదళం, ఎందుకంటే?

పుల్వామా ఉగ్రవాద దాడి జరిగిన నెల రోజులు అవుతోంది. ఆ తర్వాత కొద్ది రోజులు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఈ సమావేశం జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

India, Pakistan to hold crucial talks on Kartarpur corridor on March 14

కర్తార్‌పూర్ కారిడార్‌ అంశంపై చర్చించేందుకు ఇరు దేశాలు సమావేశం కావడం మంచి పరిణామమని, భారతీయలుకు వీసా లేకుండా గురుద్వార్‌ దర్బార్‌కు ప్రవేశం కల్పించాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ పట్టణానికి 4.5 కి.మీ దూరంలో ఈ కట్టడం ఉంది.

గురునానక్‌ దేవ్‌ ఇక్కడే పద్దెనిమిది సంవత్సరాలు నివాసమున్నారని, ఆయన ఇక్కడే నిర్యాణం చెందారు. దీంతో వీసా లేకుండా భారతీయ భక్తులకు గురుద్వార్‌ దర్బార్‌కు ప్రవేశం కల్పించాలని గత డెబ్బై ఏళ్లుగా భారత్‌కు చెందిన సిక్కులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కల నెరవేరుతోంది.

English summary
Amid the ongoing tension between India and Pakistan, the officials of the two neighbouring countries will meet for the first time on Thursday to finalise the modalities of the Kartarpur Corridor to facilitate Indian pilgrims to pray at the historic Kartarpur Sahib Gurdwara throughout the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X