వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేనికైనా భారత్ రెడీ: చైనాకు దీటుగా జవాబిచ్చిన నిర్మలా సీతారామన్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్‌ : డొక్లామ్‌లో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొవడానికైనా భారత్‌ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ఉద్ఘాటించారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లామ్ సమస్యపై నిర్మలా సీతారామన్ కూడా అంతే ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.

శనివారం భారత రాయబారి గౌతమ్‌ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్‌ క్యూను ఒకవేళ చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లామ్ లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలకు సైతం సరిహద్దులో భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు.

India ready to tackle any unforeseen situation in Doklam, says Nirmala Sitharaman

డొక్లామ్ ప్రాంతంలో చైనా హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని గత నెలలోనే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 16 నుంచి ఆగష్టు 18 వరకూ చైనా-భారత్‌ల మధ్య డొక్లామ్ విషయమై తీవ్ర సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.

English summary
Defence Minister Nirmala Sitharaman on Sunday maintained that India is ready to counter any unforeseen situation in Doklam, which had become a potential flashpoint with China. “We are alert and ready for any unforeseen situation in Doklam. We are constantly working on the modernisation of our forces. We will maintain our territorial integrity,” Sitharaman told reporters. Her comments came a day after Indian envoy to China Gautam Bambawale said that the Doklam crisis started because the Chinese military changed the status quo in the region. In a significant step that is being seen as an attempt to mend fences with Beijing, Prime Minister Narendra Modi will visit Qingdao in China for the Shanghai Cooperation Organisation summit on June 9-10, Bambawale has confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X