కరోనా: భారత్ రికార్డు -వారంలో 16లక్షల మందికి టీకాలు -కొత్తగా 14,849 కేసులు, భారీగా తగ్గిన మరణాలు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మరణాల సంఖ్య భారీగా పడిపోవడం ఊరటకలిగిస్తున్నది. రికవరీలు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు తగ్గుముఖంపట్టాయి. మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణలో వజ్రాయుధంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. టీకాల పంపిణీలో భారత్ సరికొత్త రికార్డులు సాధించింది. వివరాల్లోకి వెళితే..
Shrishti Goswami అనే నేను సీఎంగా -ఒక్కరోజు ముఖ్యమంత్రిగా రికార్డు -అసెంబ్లీ సమావేశాలు కూడా

తగ్గిన మరణాల ఉధృతి..
ఆరు నెలల కిందట రోజుకు కనీసం రెండు వేల చొప్పున దేశంలో కరోనా మరణాలు విలయంగా కొనసాగాయి. అయితే, గతేడాది చివరి నుంచే మరణాల ఉధృతి క్రమంగా తగ్గుతూ వచ్చింది. జనవరి మాసంలో ఏరోజూ 200పైచిలుకు మరణాలు నమోదుకాలేదు. ఇప్పుడా సంఖ్య ఇంకా కిందికి రావడం ఊరటకలిగిస్తున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,849 కేసులు, 155 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533కు, మరణాల సంఖ్య 1,53,339కు పెరిగింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.44శాతంగా ఉంది. ఇక..

96.82శాతం రికవరీ రేటుతో..
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 15,948 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రపంచదేశాలతో పోల్చుకుంటే భారత్ లోనే అత్యధికంగా 96.82శాతం రికవరీ రేటు ఉందని, ఇప్పటివరకు మొత్తం 1,03,16786మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1,84,408గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల రేటు 1.74శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.
RBI సంచలనం: మళ్లీ నోట్లరద్దు -పాత రూ.100 ఇక చెల్లదు -రూ.10, రూ.5నోట్లు కూడా -నాణేలపైనా

వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం ఒక ఎత్తయితే, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతుండటం పరిస్థితుల్ని ఆశజనకంగా మార్చుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,91,609మందికి టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈనెల 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా, ఇప్పటివరకు (శనివారం వరకు) దాదాపు 16 లక్షలు.. మొత్తం 15,82,201మందికి టీకాలను అందించారు. వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ఏ దేశంలోనూ తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు అందించిన దాఖలాలు లేవు.