వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా డిమాండ్ కు నో అన్న ఇండియా ... అక్కడ నుండి వెనక్కు తగ్గేది లేదు.. రీజన్ ఇదే !!

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా సరిహద్దులను ఉద్రిక్త వాతావరణ ఇంకా అలాగే ఉంది. ఉత్తర లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో చైనా దళాలు వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా భారత సైన్యాన్ని అక్కడి నుండి వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దళాలు వెనక్కు తగ్గేది లేదని తేల్చిచెప్పాయి.

Recommended Video

#IndiaChinaStandoff : LAC నుండి Indian Army వెనక్కి వెళ్లాలని China డిమాండ్, భారత్ ఘాటు రిప్లై !

తగ్గిన దూకుడు... అయినా గంభీర ప్రకటనలు... యాప్స్ నిషేధంపై చైనా లేటెస్ట్ రియాక్షన్...తగ్గిన దూకుడు... అయినా గంభీర ప్రకటనలు... యాప్స్ నిషేధంపై చైనా లేటెస్ట్ రియాక్షన్...

 భారత సైన్యాన్ని వెనక్కు వెళ్ళమన్న చైనా సైన్యం .. నో అన్న ఇండియన్ ఆర్మీ

భారత సైన్యాన్ని వెనక్కు వెళ్ళమన్న చైనా సైన్యం .. నో అన్న ఇండియన్ ఆర్మీ

ఫింగర్ 3 పాయింట్ వద్ద ఉన్న థాన్సింగ్ థప్పా పోస్ట్ నుండి భారత దళాలను వెనక్కి వెళ్లాలని చైనా డిమాండ్ చేయడంతో, చైనా డిమాండ్ ను భారతదేశం తిరస్కరించింది. ప్రస్తుత సైనిక స్థానం నుండి తిరిగి వెళ్ళమని చైనా భారత సైన్యాన్ని కోరింది. లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వెంట రెండు దేశాల సరిహద్దులను విభజించే ప్రక్రియలో ప్రతిష్టంభనను తొలగించడానికి చైనా ఈ చర్యను సూచించింది.

 ఫింగర్ -4 వద్ద వెనక్కు తగ్గని చైనా ఆర్మీ

ఫింగర్ -4 వద్ద వెనక్కు తగ్గని చైనా ఆర్మీ

మంగళవారం సాయంత్రం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని చైనా స్టడీ గ్రూప్ సమావేశం తరువాత లడఖ్‌లోని హాట్‌లైన్ ద్వారా న్యూ ఢిల్లీ నుండి తాము తీసుకున్న నిర్ణయం బీజింగ్‌కు తెలియజేశారు . ఆదివారం జరిగిన లెఫ్టినెంట్ జనరల్-స్థాయి సమావేశంలో, చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ఫింగర్ -4 వద్ద ఉన్న స్థానం నుండి వెనక్కి (తూర్పు వైపు లేదా ఎల్‌ఐసికి దూరంగా) వెళ్లకూడదని మొండిగా ఉంది. ఫింగర్ -4 నుండి పిఎల్‌ఎ దళాలను ఉపసంహరించుకోవడం యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారతదేశం నిర్దేశించిన మూడు షరతులలో ఒకటి.

భారత అధీనంలో ఉన్న ప్రాంతం నుండి వెళ్ళమనటం ఆమోద యోగ్యం కాదన్న ఆర్మీ

భారత అధీనంలో ఉన్న ప్రాంతం నుండి వెళ్ళమనటం ఆమోద యోగ్యం కాదన్న ఆర్మీ

అయితే షరతును ఉల్లంఘించి ప్రతిష్టంభనను తొలగించడానికి తిరిగి వెళ్లాలని ఇండియాను చైనా కోరింది. ఫింగర్ -4 కి పడమటి ప్రాంతం ఎల్లప్పుడూ భారత నియంత్రణలో ఉంది మరియు బీజింగ్ భారత సైన్యాన్ని వెనక్కి తరలించమని కోరడం ఆమోదయోగ్యం కాదని వర్గాలు తెలిపాయి. విడదీయడం ప్రక్రియలో భాగంగా ఇరువైపుల దళాల మధ్య 3 కిలోమీటర్ల బఫర్ జోన్ ఇప్పటికే ఫింగర్ -4 వద్ద ఉంది . "LAC నుండి మరింత దూరం వెళ్ళమని మమ్మల్ని అడగడం ఆమోదయోగ్యం కాదు" అని భారత సైనిక వర్గాలు తెలిపాయి.

 ఇండియా భూభాగంలోకి వస్తున్న చైనా ఆర్మీని హెచ్చరించిన ఆర్మీ

ఇండియా భూభాగంలోకి వస్తున్న చైనా ఆర్మీని హెచ్చరించిన ఆర్మీ

గతంలో ఇండియా పెట్రోలింగ్ చేసే ప్రాంతంలో కూడా చైనా దళాలు చొచ్చుకు రావడం తో ఇండియా మరింత అప్రమత్తమైంది. తమ భూభాగంలోకి వచ్చిన చైనా ఆర్మీ వెనక్కి వెళ్లాలని ఇండియా ఆర్మీ కోరింది. లేదంటే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. గాల్వాన్ లోయ ఘటన తరువాత ఇండియా చైనా దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిగినా చైనా దళాలు వెనక్కి తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకు చైనా దళాలు వెనక్కి వెళ్లాలని ఇండియా డిమాండ్ చేస్తూనే ఉంది. ఇక తాజాగా తాము వెనక్కి తగ్గేది లేదని ఇండియన్ ఆర్మీ చైనాకు తేల్చిచెప్పింది.

English summary
India has rejected China’s request, asking the Indian Army to “reciprocate” and move back from its present military position north of the Pangong Tso. China suggested this step to break the deadlock in the disengagement process along the Line of Actual Control (LAC) in Ladakh. but indian army refused .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X