వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఉత్పాతం: రోజురోజుకూ అధ్వాన్నంగా: 14 లక్షలను దాటి: ఊహించని వేగం: దారుణ స్థితికి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోల పరిస్థితులు మిగిల్చేలా కనిపిస్తోంది. క్రమంగా ఉత్పాతంలా పరిణమిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. లాక్‌డౌన్ సడలింపులను ప్రకటించిన తరువాత వాటి తీవ్రత రెట్టింపయింది. పాజిటివ్ కేసుల దూకుడు కొనసాగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. దీనికి అనుగుణంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకు కారణమౌతోంది.

Recommended Video

#Lockdown : PM Modi Clarifies About Lockdown Extension

సోనూసూద్‌కు చంద్రబాబు: మేం భరిస్తామని హామీ: త్వరలో కలుద్దామన్న యాక్టర్: స్పందించిన రైతుసోనూసూద్‌కు చంద్రబాబు: మేం భరిస్తామని హామీ: త్వరలో కలుద్దామన్న యాక్టర్: స్పందించిన రైతు

 అరలక్షకు చేరువగా..

అరలక్షకు చేరువగా..

దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 49,931 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 708 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరుకుంది. మరణాల సంఖ్య 32 వేలను దాటుకుంది. మొత్తం కరోనా మరణాలు 32,771కి చేరుకున్నాయి. ఇప్పటిదాకా 9,17,568 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,85,114గా నమోదైంది. కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 45 వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

మూడురోజుల్లోనే లక్షలకు పైగా..

మూడురోజుల్లోనే లక్షలకు పైగా..

క్రమంగా ఈ సంఖ్య అరలక్షను చేరుకుంటోంది. మూడు రోజుల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొన్నటికి మొన్నే 13 లక్షల మార్క్‌‌ను అందుకున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆదివారం నాటికి 14 లక్షలను దాటేశాయి. మూడు రోజుల్లోనే లక్షకు పైగా కేసులు రికార్డు అయ్యాయి. ఫలితంగా తాజా కేసుల సంఖ్య 14,35,453కు చేరుకుంది. రోజూ 50 వేలకు కాస్త అటు, ఇటుగా కేసులు నమోదవుతున్నాయి. దీని ఫలితంగా కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదలలో అనూహ్యమైన వేగం ఏర్పడింది. కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు కారణమౌతున్నట్లు కేంద్రం భావిస్తోంది.

ఏపీ సహా

ఏపీ సహా

ప్రత్యేకించి- ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి అమాంతంగా పెరిగింది. రోజూ వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం నాడు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 7627 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 96,298కు చేరుకుంది. ఇప్పటిదాకా 46,301 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు. వెయ్యి మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య 1041కి చేరింది. యాక్టివ్‌గా ఉన్న కేసులు సంఖ్య 48,956గా నమోదైంది.

పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో..

పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో..

ఇదే పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో నెలకొంది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులకు ఏ మాత్రం కళ్లెం పడట్లేదు. ఫలితంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. తెలంగాణలో కూడా దీనికి భిన్నమైన పరిస్థితులేమీ లేవు. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఇదివరకు లేనివిధంగా ఏపీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇదే పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది. తమిళనాడు, కర్ణాటకల్లోనూ గతంలో కంటే అధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

English summary
India has recorded a spike of 49,931 positive cases and 708 deaths in the last 24 hours. Total Covid-19 positive cases stand at 14,35,453 including 4,85,114 active cases, 9,17,568 discharged and 32,771 deaths, says data by Health Ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X