వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో 90 లక్షలు దాటి కరోనా విజృంభణ.. ఈ రోజు కేసులు, మరణాల లెక్క ఇదే !!

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనావైరస్ పంజా విసురుతూనే ఉంది. క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,232 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 564 మరణాలతో, భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 90,50,598 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇండియాలో మరణించిన వారి సంఖ్య 132,726 కు పెరిగింది . ఇక కోవిడ్ -19 యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 439,747 గా ఉంది.

కరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థకరోనా బాంబులుగా ఉగ్రవాదులు... వార్నింగ్ ఇస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ

కరోనా నుండి కోలుకున్నవారు 8,478,124 మంది

కరోనా నుండి కోలుకున్నవారు 8,478,124 మంది

ఉదయం 8 గంటలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం , కరోనా నుండి ఇప్పటివరకు 8,478,124 మంది కోలుకోగా, గత 24 గంటల్లో 49,715 మంది రికవర్ అయ్యారు. జాతీయ రికవరీ రేటు శనివారం 93.67 శాతానికి మెరుగుపడిందని తెలుస్తుంది . కరోనావైరస్ కోలుకున్న మరియు యాక్టివ్ గా ఉన్న కేసుల మధ్య అంతరం 8,038,377 కు పెరిగింది. 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 20,000 కంటే తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మహారాష్ట్రలో కేసుల తీవ్రత ..గత 24 గంటల్లో 5,640 కొత్త కేసులు

మహారాష్ట్రలో కేసుల తీవ్రత ..గత 24 గంటల్లో 5,640 కొత్త కేసులు

అత్యధికంగా కరోనా కారణంగా దెబ్బతిన్న రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత 24 గంటల్లో 5,640 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరుణ కేసుల సంఖ్య 17, 68,695 కి చేరింది. ప్రస్తుత మహారాష్ట్ర లో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 78 , 272 గా ఉంది . కరోనా మహమ్మారి కారణంగా మహారాష్ట్ర ఇప్పటివరకు 46, 511 మంది మృతి చెందారు.

Recommended Video

COVID-19 Vaccine : కరోనా చికిత్సకు Remdesivir వాడొద్దని స్పష్టం చేసిన WHO..!
వ్యాక్సిన్ తయారీ, పంపిణీ వ్యూహంపై ప్రధాని కీలక సమీక్ష

వ్యాక్సిన్ తయారీ, పంపిణీ వ్యూహంపై ప్రధాని కీలక సమీక్ష

కరోనావైరస్ నిరోధించటానికి వ్యాక్సిన్ల తయారీ , సేకరణ మరియు పంపిణీ వ్యూహాన్ని ప్రధానమంత్రి మోడీ శుక్రవారం సమీక్షించారు. భారతదేశం యొక్క కరోనా వ్యాక్సిన్ తయారీలో పురోగతి, నియంత్రణ ఆమోదాలు మరియు సేకరణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి అని మోడీ సమావేశం తరువాత ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ వచ్చాక ప్రాధాన్యతా క్రమంపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది . దేశంలోని మరియు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్ కు సంబంధించిన పరిశోధనల పురోగతి గురించి చర్చించి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అన్నదానిపై చర్చించినట్టు సమాచారం .

English summary
With 46,232 new cases of the coronavirus disease (Covid-19) and 564 related deaths, India’s tally rose to 9,050,598, according to the Union health ministry on Saturday, The country’s death toll has mounted to 132,726 and the number of active cases of Covid-19 stands at 439,747.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X