వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ విమానం పాక్ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి కోరిన భారత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ న్యూయార్క్‌ వెళ్లనున్న ఎయిరిండియా విమానం తమ గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వంకు భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేసింది.

భారత ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అమెరికా పర్యటనకు వెళుతున్నారు. అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన విదేశీ పర్యటన సందర్భంగా తన విమానం వెళ్లేందుకు తమ గగనతలం వినియోగించేందుకు అనుమతి నిరాకరించింది పాకిస్తాన్.

వీవీఐపీల ప్రత్యేక విమానాలు తమ గగనతలంలో ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. ఇతర దేశాలకు చెందిన వీవీఐపీల విమానాలకు గగనతలం వినియోగించేందుకు అనుమతిచ్చిన పాకిస్తాన్ ఒక్క భారత్ విషయంలోనే విరుద్ధంగా ప్రవర్తిస్తోందంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా ప్రభుత్వం వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో పాకిస్తాన్‌కే నష్టమని భారత్ పేర్కొంది.

India requests Pak to grant permission for its airspace for Modis flight

ఫిబ్రవరిలో పుల్వామా దాడులకు ప్రతీకారచర్యల్లో భాగంగా భారత్ బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఇక అప్పటి నుంచి తమ గగనతలంను పూర్తిగా మూసివేసింది.మార్చిలో పాక్షికంగా తెరిచింది.

అయితే న్యూఢిల్లీ, బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌లకు వెళ్లే విమానాలకు మాత్రం గగనతలంలో ఎగిరేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇక జూలైలో అన్ని విమానాలకు గగనతలంను తెరిచింది పాకిస్తాన్. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో మళ్లీ పాకిస్తాన్ భారత విమానాలపై ఆంక్షలు విధించింది.

English summary
Indian government has requested Pak to grant permission of its airspace for the Indian PM Modi's flight who will be flying to US on September 21st, reported Pak media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X