వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫూలిష్ సిద్దాంతాలు కాదు.. కావాల్సింది.., నిర్మాణాత్మక ప్రణాళికలు కావాలి: రాహుల్ గాంధి

|
Google Oneindia TeluguNews

భారత ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడేందుకు సమగ్రమైన ప్రణాళిక ఉండాలి తప్ప అనవసరమైన సిద్దాంతాలు కాదని కేంద్రమంత్రి నిర్మల సితారామన్‌కు సూచించారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. అంతే తప్ప తప్పుడు కారణాలు,తప్పుడు సిద్దాంతాలతో ప్రజలను గందరగోళానికి గురి చేయవద్దని రాహుల్ గాంధీ హితవు పలికారు.కార్ల కొనుగోలు తగ్గడంపై కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సితారామన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన రెండు రోజుల అనంతరం స్పందించారు. సమస్యను ఉన్నది ఉన్నట్టు అంగీకరించడం మంచి లక్షణమని చెప్పారు.

రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్ల కొనుగోలు తగ్గడంపై వింత వాదన తీసుకువచ్చిన విషయం తెలిసిందే, దేశంలో కార్ల విక్రయాలు పడిపోవడానికి క్యాబ‌‌్‌లే కారణమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆటోమొబైల్ విక్రయాలు పడిపోవడానికి క్యాబ్‌లే కారణమని .. యువత కార్లు కొనేందుకు ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. కారు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొవడం కన్నా .. క్యాబ్ బుక్ చేసుకోవడమే మేలని యువత భావిస్తున్నారని ఆమే తెలిపారు. అయితే కేంద్రమంత్రి చేసిన కామెంట్లపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక సోషల్ మీడీయాలో అయితే నెటిజన్లు వింత వింత కామెట్లు పెట్టారు.

India requires a “concrete plan to fix the economy” : Rahul Gandhi

మరోవైపు ఆమే చేసిన వ్యాఖ్యలను స్వంతపార్టీ నేతలే విమర్శించారు. నిర్మల సితారామన్ చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఆటోరంగంలో అమ్మకాలు తగ్గడానికి గల కారణాలను ఆమే తప్పుగా పేర్కోన్నారని ఆయన చెప్పారు. వాహన విక్రయాలు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు.

English summary
Congress leader Rahul Gandhi on Thursday took a swipe at Union Finance Minister Nirmala Sitharaman, saying India requires a “concrete plan to fix the economy” and not “foolish theories about millenials”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X