వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ చైనా.. FDI పాలసీలో కేంద్రం కీలక సవరణలు.. ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) పాలసీలో భారత్ కీలక సవరణలు చేసింది. భారత్‌తో సరిహద్దును పంచుకునే దేశాలు ఇకపై మన దేశంలోని కొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్రం 17 రంగాలను ఈ జాబితాలో చేర్చింది. ఇంతకుముందులా కేంద్రం అనుమతి లేకుండానే ఆటోమేటిక్ రూట్‌లో ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు కుదరదు. నిజానికి బంగ్లాదేశ్,పాకిస్తాన్‌ ఎఫ్‌డీఐలపై భారత్ ఇప్పటికే ఈ నిబంధనలు విధించింది. తాజాగా పొరుగు దేశాలన్నింటికీ ఇదే నిబంధనను వర్తింపజేస్తూ పాలసీలో సవరణలు చేసింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ఇండస్ట్రీ&ఇంటర్నల్ ట్రేడ్(DPIIT) ప్రెస్‌నోట్ ద్వారా ఈ విషయాలు వెల్లడించింది.

ఎందుకీ నిర్ణయం..

ఎందుకీ నిర్ణయం..

కరోనా మహమ్మారి పర్యవసానాలు ఆర్థిక సంక్షోభానికి దారితీసే పరిస్థితులు నెలకొడంతో చాలా కంపెనీల సెన్సెక్స్ పడిపోతోంది. ఇదే అదనుగా చైనా భారత్‌లోని పలు కంపెనీల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇటీవలే హెచ్‌డీఎఫ్‌సీలో పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా 1శాతం మేర షేర్లు కొనుగోలు చేసింది. ఇలా స్వేచ్చాయుత ఎఫ్‌డీఐలకు అనుమతిస్తే.. చైనా క్రమంగా మన దేశంలో పాతుకుపోయే అవకాశం ఉందని భారత్ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏయే రంగాలకు..., ఓనర్‌షిప్ కూడా సులువు కాదు..

ఏయే రంగాలకు..., ఓనర్‌షిప్ కూడా సులువు కాదు..


ఎఫ్‌డీఐ పాలసీలో కేంద్రం చేర్చిన 17 రంగాల జాబితాలో రక్షణ,టెలికాం,ఫార్మాతో పాటు తదితర రంగాలున్నాయి. వీటికి కేంద్రం అనుమతి తప్పనిసరి. ఇవి కాకుండా మిగతా రంగాల్లో ప్రవాస కంపెనీల పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్‌లోనూ పెట్టుబడులు పెట్టుకోవచ్చు. వాటికి కేంద్రం అనుమతి నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం భారత్‌లోని కంపెనీల్లో ఎఫ్‌డీఐలను పెంచుకుని ఓనర్‌షిప్ దక్కించుకోవడం కూడా పొరుగు దేశాలకు ఇప్పుడంత సులువు కాదు. కంపెనీల ఓనర్‌షిప్ మార్పుకు కూడా కేంద్రం అనుమతి తప్పనిసరి.

చైనా పెట్టుబడులపై సెబీ ఆరా

చైనా పెట్టుబడులపై సెబీ ఆరా

ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(FEMA) నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. ఇటీవల పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడుల నేపథ్యంలోనే కేంద్రం ఎఫ్‌డీఐ పాలసీలో మార్పులు చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు,ఇటీవల సెబీ కూడా చైనా పెట్టుబడులపై వివరాలు ఇవ్వాల్సిందిగా కస్టోడియన్లను కోరింది. చైనీస్ ఎఫ్‌డీఐ వివరాలను సెబీ కోరడం ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు సైతం అభిప్రాయపపడుతున్నారు. కేంద్ర నుంచి ఉన్న ఆదేశాల మేరకు సెబీ ఇలా నిఘా పెట్టిందన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం ఇండియాలో చైనాకు చెందిన 16 రిజిస్టర్‌‌‌‌ ఎఫ్‌‌పీడీలు ఉన్నాయి.

Recommended Video

China's Economy Shrinks For The First Time Ever

English summary
The government has amended the Foreign Direct Investment (FDI) policy to discourage opportunistic investment in Indian companies by neighbouring countries in the midst of the Coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X