వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 10 వేల కోట్లు: భారత్ కు యూఎస్-2ఐ విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నీటిలో, భూమి మీద ఎలాంటి సమస్యలు లేకుండా ల్యాండ్ అయ్యే 12 జపనీస్ యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యడానికి భారత్ దాదాపు సిద్దం అయ్యింది. నవంబర్ 11,12 తేదిల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ లో పర్యటించనున్న సందర్బంలో యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని నిర్ణయించారు.

యూఎస్ -2ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని భారత్ కొత్తగా ఆలోచించిన విషయం కాదు. 2013లోనే భారత్ యూఎస్-22ఐ విమానాలు కొనుగోలు చెయ్యాలని భావించింది. అందుకు పెద్ద మొత్తంలో చెల్లించవలసి ఉండటంతో భారత్ కొద్దిగా వెనుకడుగు వేసింది.

అయితే జపాన్ కొంత మొత్తం తగ్గించి విమానాలు ఇస్తామని చెప్పడంతో ఎట్టకేలకు భారత్ యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చెయ్యడానికి అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ లో పర్యటిస్తుండటంతో దౌత్య సంబంధాలు మరింత బలోపేతం చెయ్యాలని నిర్ణయించారు.

India revives project to acquire Japanese US-2i amphibious aircraft

యూఎస్-2ఐ విమానాలు కొనుగోలుతో పాటు ఈ పర్యటనలో న్యూక్లియర్ టెక్నాలజీ ఒప్పందాలపై కీలక నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం. యూఎస్-2ఐ విమాను కొనుగోలు చేసిన తరువాత ఆరు విమానాలు నేవీ, కోస్టు గార్డులు వినియోగించనున్నారని సమాచారం. జపాన్ తో ఎంఓయూ కుదుర్చుకోవడంపై డిఫెన్స్ అక్విసైషన్స్ కౌన్సిల్ (డీఎసీ) సోమవారం చర్చించనుంది.

నాలుగు పెద్ద టర్బో ప్రొపెలర్లు కలిగిన యూఎస్-2ఐ విమానాలు నీటి మీద, భూమి మీద తక్కువ దూరం ప్రయాణించి వెంటనే టేకాఫ్ కాగలవు. అత్యవసర సమయాల్లో దాదాపు 35 మంది సైనికులను ఒకే సారి ఈ విమానాల్లో ఒక చోట నుంచి మరో చోటకు తరలించడానికి అవకాశం ఉంది.

రక్షణ చర్యల్లో భాగంగా భారత్ జపాన్ నుంచి ఈ అత్యాధునిక యూఎస్-2ఐ విమానాలు కొనుగోలు చేస్తోంది. రక్షణ చర్యలో భాగంగా జపాన్ ఈ అత్యాధునికి యూఎస్-2ఐ విమానాలు తయారు చేసింది.

ప్రస్తుతం నేవీకి సబ్ మెరైన్ల నుంచి మల్టీ రోల్ హెలికాప్టర్ల వరకూ అవసరం ఉండటంతో యూఎస్-2ఐ విమానాల చేరిక ఆసియా-పసిఫిక్ లో బలం చేకూరే అవకాశం ఉందని రక్షణ శాఖ నిపుణులు అంటున్నారు.

English summary
Powered by four big turbo-props, the US-2i is capable of short take-offs from land as well as water. While basically meant for search and rescue operations, the US-2i can also rapidly transport 30 combat-ready soldiers to "hot zones" in an emergency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X