వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియా, ఆరెస్సెస్ పర్యాయపదాలే.. ఏంటీ అని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆరెస్సెస్ చురకలు

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఆరెస్సెస్ నేత ప్రధాన కార్యదర్శి సంఘ్ కృష్ణ గోపాల్ ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. భారత్, ఆరెస్సెస్ పర్యాయపదాలే అయితే ఏంటీ అని ప్రశ్నించారు. ఆరెస్సెస్‌పై ఇమ్రాన్ వెళ్లగక్కిన అక్కసుపై ధ్వజమెత్తారు. ఆరెస్సెస్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఇమ్రాన్‌ఖాన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోపాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

ఆరెస్సెస్‌పై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తే అది సంస్థపై కాదని, దేశంపై అని గోపాల్ అన్నారు. ఆరెస్సెస్ ఇండియా అనే పదానికి పర్యాయ పదం అని గుర్తుచేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ భారతదేశంలో ఉందని గోపాల్ అన్నారు. తమకు ఇతర దేశాల్లో శాఖలు లేవని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా, ఆరెస్సెస్ ఒకటే చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

india, rss are synonymous.. rss ask to imran khan

ఉగ్రవాదాన్ని ఆరెస్సెస్ ప్రోత్సహిస్తుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించడంతో గోపాల్ ఘాటుగా స్పందించారు. ఆరెస్సెస్ క్యాంపుల్లోనే ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఆరెస్సెస్ భాగస్వామి అని ఇమ్రాన్ ఆరోపించారు. ఆరెస్సెస్ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, ఇటలీ నియంత ముస్సొలినీ చూసి స్ఫూర్తిపొందిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో గోపాల్, ఇమ్రాన్‌ఖాన్‌కు స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు.

చిన్న దేశమైన సరే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు వెనుకాడబోమని ఇమ్రాన్‌ఖాన్ సంకేతాలు ఇచ్చారు. భౌగోళికంగా పాకిస్థాన్ భారత్ కంటే 7 రేట్లు చిన్నగా ఉన్న అణ్వాయుధాలను కూడబెట్టుకుందన్నారు. ఇప్పుడే కాదు ఇదివరలో కూడా ఇమ్రాన్ ఖాన్ యుద్ధం గురించి పరోక్షంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర హోంమంత్రి, ఆరెస్సెస్ నేత కృష్ణ గోపాల్ ప్రతిస్పందించారు.

English summary
Rashtriya Swayamsevak Sangh and India are synonymous and if Pakistan Prime Minister Imran Khan is angry with the RSS it means he’s angry with India, said the joint general secretary of the Sangh Krishna Gopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X