• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ-పుతిన్ చర్చలు ఫలప్రదం-28 ద్వైపాక్షిక ఒప్పందాలు-మేకిన్ ఇండియాకు రష్యా మద్దతు

|
Google Oneindia TeluguNews

21వ వార్షిక భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. కరోనా తో ఎన్నో సవాళ్లు ఎదురైనా భారత్-రష్యా సంబంధాల వృద్ధి వేగంలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ తెలిపారు. ఇరుదేశాల మధ్య విశేష, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టంగా కొనసాగుతోందన్నారు. గత కొన్ని దశాబ్దాలలో, ప్రపంచం అనేక ప్రాథమిక మార్పులను చూసిందని మోడీ తెలిపారు. వివిధ రకాల భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయన్నారు అయితే భారతదేశం, రష్యాల మధ్య స్నేహం మాత్రం స్థిరంగా ఉందన్నారు. భారత్, రష్యా మధ్య బంధం వాస్తవంగా దేశాంతర స్నేహానికి ఓ ప్రత్యేకమైన, నమ్మదగిన నమూనా అని మోడీ అభివర్ణించారు. భారత్ పట్ల మీ ప్రేమ చాలా స్పష్టమైనదని పుతిన్ ను ఉద్దేశించి మోడీ తెలిపారు. కోవిడ్, ఇతర సవాళ్లు ఉన్నప్పటికీ, భారతదేశం-రష్యా సంబంధాలు ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు.

దీనిపై స్పందించిన పుతిన్.. మేము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, కాల పరీక్షకు తట్టుకున్న మిత్రదేశంగా భావిస్తున్నామని తెలిపారు. మన దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్తుపై తాను ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు. సహజంగానే, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న ప్రతిదాని గురించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటానికి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్‌లో తాజా పరిణామాలపైనా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

india-russia ink 28 pacts and mous in modi-putin meet including support to make in india today

ప్రస్తుతం, ఇరుదేశాల పెట్టుబడులు దాదాపు 38 బిలియన్‌లుగా ఉన్నాయని, రష్యా వైపు నుండి కొంచెం ఎక్కువ పెట్టుబడివస్తోందన్నారు.. మరే ఇతర దేశంలో లేని విధంగా తాము సైనిక, సాంకేతిక రంగాలలో భారత్ కు సహకరిస్తామన్నారు.. ఇరుదేశాలూ కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తామని, అలాగే భారతదేశంలో ఉత్పత్తి చేస్తామన్నారు.

మోడీ-పుతిన్ భేటీ విశేషాల్ని విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా వెల్లడించారు. ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాల మెరుగుదల లక్ష్యంగా ఇరుదేశాల అధినేతలు మోడీ, పుతిన్ చర్చలు జరిగినట్లు విదేశాంగశాఖ కార్యదర్శి ష్రింగ్లా ప్రకటించారు.
బ్యాంకింగ్, సైబర్ దాడులు, చమురు, సీమాంతర తీవ్రవాదం, వాణిజ్యం వంటి అంశాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయన్నారు.

పుతిన్ భారత్ పర్యటన ఒక్క రోజే అయినా చాలా కీలకమైందన్నారు. ఇరువురు నేతల మధ్య అద్భుతమైన చర్చలు జరిగాయని, ఇందులో 28 ఒప్పందాలు/ఎంఓయూలు కుదిరాయని ష్రింగ్లా తెలిపారు. ఈ ఒప్పందాలలో ఇరు ప్రభుత్వాలకూబ, ఇరుదేశాల వాణిజ్య వర్గాలకూ మధ్య ఒప్పందాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో రష్యాలోని భారతీయ సమాజ సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన పౌరులు ఒకరి దేశాలకు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా వ్యాక్సినేషన్ గుర్తింపు అవసరాన్ని ఇరువురు నేతలు చర్చించారు:

Omicron Variant : Booster Vaccine Coming Soon! || Oneindia Telugu

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం మోడీ, పుతిన్ చర్చల్లో ప్రధానంగా చర్చకు వచ్చిందని ష్రింగ్లా తెలిపారు. ఈ సంవత్సరం, గత సంవత్సరంతో పోల్చితే ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో ప్రోత్సాహకరమైన వృద్ధిని గమనించినట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం మరియు పెట్టుబడి అంశాల్లో నిరంతర పెరుగుదల కోసం ఇరుపక్షాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడి, అంతర్గత జలమార్గాలు, ఎరువులు, కోకింగ్ బొగ్గులు, ఉక్కు, నైపుణ్యం కలిగిన మానవశక్తి రంగాలలో దీర్ఘకాలిక కార్పొరేషన్‌ను కలిగి ఉన్న కొన్ని నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. కోకింగ్ బొగ్గు కార్పొరేషన్ యొక్క ముఖ్యమైన ప్రాంతంగా ఉద్భవించిందన్నారు. సీమాంతర ఉగ్రవాద సమస్య పరిష్కరించే విషయంలో ఇరుదేశాల నేతలు ఉమ్మడిగా చర్చించినట్లు తెలిపారు. అలాగే చమురు, గ్యాస్, పెట్రోకెమికల్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు భారత్ తెలిపింది.

English summary
after prime minister narendra modi and russian president vladimir putin's meeting, both have released a joint statement on various issues including pacts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X