వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదృష్టం వరించింది: గుజరాత్‌లో తొలి రైల్వే యూనివర్శిటీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వడోదర: భారత్‌లో తొలి రైల్వే యూనివర్సిటీని గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రైల్వే యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ విధివిధానాలను రూపొందించిన కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా పేర్కొన్నారు.

వడోదర‌లోని ప్రతాప్ విలాస్ ప్యాలెస్‌ను యూనివర్శిటీ తాత్కాలిక భవనంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఇక్కడే భారతీయ రైల్వేకు ఎంపికయ్యే ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. భూ సమీకరణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో యూనివర్సిటీ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.

India's 1st railway university to come up in Gujarat

రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వచ్చిన ఆయన, రైల్వే యూనివర్శిటీకి అవసరమైన అన్ని వసతులను కల్పించేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ (ఎన్ఏఐఆర్)ని ఏర్పాటు చేస్తున్నామని, భూ సేకరణ తర్వాత ప్రతాప్ విలాస్ ప్యాలెస్ నుంచి యూనివర్శిటీ భవనాన్ని తరలిస్తామన్నారు.

తొలి దశలో ఎంబీఏ, ఎంటెక్ డిగ్రీ విద్యార్థులకు డిప్లమో, రైల్వే ఆపరేషన్స్ విభాగంలో బీటెక్ కోర్సులను ఆఫర్ చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. రైల్వే స్టాఫ్ కాలేజీనే ఎన్ఏఐఆర్‌గా నామకరణం చేశారు. భారతీయ రైల్వేలోని ఆఫీసర్లకు ఇందులోనే శిక్షణ ఇచ్చేవారు.

English summary
adodara will be home to the country's first railway university, minister of state for railways Manoj Sinha has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X