• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ సర్కారుకు ఎదురుదెబ్బ?.. నిరుద్యోగం పెరిగిందంటున్న గణాంకాలు

|

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల వేళ మోడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు ఓ ప్రైవేట్ సంస్థ తేల్చింది. అయితే ఈసారి లోక్‌సభ ఏడు విడతల ఎన్నికలకు గాను ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. మే 6వ తేదీన ఐదు.. 12వ తేదీన ఆరు.. 19వ తేదీన తుది విడత పోలింగ్ జరగనుంది. ఇంకా మూడు దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగ రేటు గణాంకాలు.. మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచనున్నాయనే వాదనలు జోరందుకున్నాయి.

 ఉద్యోగాలెక్కడ.. భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

ఉద్యోగాలెక్కడ.. భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

అన్ ఎంప్లాయిమెంట్ రేటు పతాక స్థాయికి చేరిందనే ప్రచారం మోడీ ప్రభుత్వానికి ఇబ్బందికరమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నిరుద్యోగ రేటు 7.6 శాతానికి ఎగబాకిందనే గణాంకాలు హాట్ టాపిక్ గా మారాయి. మూడేళ్ల నుంచి ఎన్నడూలేనంతగా ఉద్యోగవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందనే చర్చ జోరందుకుంది. ముంబయికి చెందిన సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన తాజా గణాంకాలు దుమారం రేపుతున్నాయి.

కలహాలతో విడిపోయిన దంపతులు.. మళ్లీ కలిపిన ఎంపీటీసీ ఎన్నికలు

సీఎంఐఈ లెక్కలు.. కేంద్రానికి చుక్కలు

సీఎంఐఈ లెక్కలు.. కేంద్రానికి చుక్కలు

సీఎంఐఈ విడుదల చేసిన ఈ గణాంకాలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ-బీఎస్పీ కూటమికి వరం కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలు పూర్తికావడానికి మరో 3 విడతల్లో పోలింగ్ జరగనుండటంతో.. నిరుద్యోగ రేటు గణాంకాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలు మోడీ సర్కారును ఇబ్బందిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రతి ఐదేళ్లకోసారి నిరుద్యోగ వివరాలను కేంద్ర ప్రభుత్వమే వెల్లడించాల్సి ఉంటుంది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో అనూహ్యంగా మీడియాలో ఆ గణాంకాలు లీక్ కావడం గమనార్హం. వాస్తవానికి 2017-18 నాటికి నిరుద్యోగ రేటు భారీ స్థాయిలో పెరిగిందనే టాక్ నడిచింది. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఉద్యోగవకాశాలు తగ్గిపోయాయనేది ఆ గణాంకాల సారాంశం. దాంతో ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయకుండా నిలిపివేసింది. కచ్చితత్వం చూడాల్సిన అవసరముందనే సాకుతో అన్ ఎంప్లాయిమెంట్ రేటు వివరాలు వెల్లడించలేదనే ఆరోపణలు వచ్చాయి.

మూడేళ్లలో ఇదే ఎక్కువ

మూడేళ్లలో ఇదే ఎక్కువ

నిరుద్యోగ రేటు 7.6 శాతానికి అమాంతం పెరిగిపోయిందని గణాంకాలు వెల్లడించిన సీఎంఐఈ.. 2016 అక్టోబర్ తర్వాత ఇంతలా పెరగడం ఇదే మొదటిసారని వెల్లడించింది. మార్చిలో నిరుద్యోగ రేటు కొంతమేర తగ్గుతున్నట్టు కనిపించినా.. ఏప్రిల్‌ నాటికి భారీ స్థాయిలో పెరిగిందని వ్యాఖ్యానించారు సీఎంఐఈ హెడ్ మహేశ్ వ్యాస్. అదలావుంటే మే నెల చివరికల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుండటం, కొత్త పాలసీల కోసం కంపెనీలు ఎదురుచూస్తుండటం.. తదితర అంశాలు నిరుద్యోగ రేటు అమాంతం పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India’s unemployment rate in April rose to 7.6 percent, the highest since October 2016, and up from 6.71 percent in March, according to data compiled by the Centre for Monitoring Indian Economy (CMIE). The figures could be a setback for Prime Minister Narendra Modi during a staggered general election that will end on May 19, with opposition parties criticising the government over weak farm prices and low jobs growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more