వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా పీక్ దశకు మనం చాలా దూరం, ప్రపంచం కంటే ఎంతో మెరుగు: కేంద్రం స్పష్టత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముందుగా తీసుకున్న జాగ్రత్తల వల్లే కరోనా ప్రభావిత ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగైన స్థితిలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ శాస్త్రవేత్త నివేదిక గుప్తా వైరస్ పరిస్థితిపై మీడియాకు వివరించారు. మొత్తం కేసుల సంఖ్యను బట్టి కరోనావైరస్ పరంగా భారత్ ఏడో స్థానంలో ఉందనడం సరికాదని లవ్ అగర్వాల్ అన్నారు.

భారత్‌లో మరణాలు రేటు చాలా తక్కువ

భారత్‌లో మరణాలు రేటు చాలా తక్కువ

14 దేశాలు మొత్తం జనాభాను తీసుకుని పోలిస్తే భారత్ కన్నా అక్కడ 55.2 శాతం ఎక్కువ కేసులు, మరణాలు నమోదయ్యాయని తెలిపారు. భారత్‌లో మరణాల రేటు 2.82 శాతంగా ఉంది. ప్రపంచ మరణాల రేటు 6.13తో పోలిస్తే ఇది చాలా స్వల్పం. సరైన సమయంలో కేసులను గుర్తించి మెరుగైన చికిత్స అందించడం వల్లే ఇది సాధ్యమైంది. మనదేశంలో లక్ష మందికి 0.41శాతం మరణిస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఇది 4.9శాతంగా ఉంది. అయితే, భారత్‌లో చనిపోయిన ప్రతి ఇద్దరు కరోనా రోగుల్లో ఒక సీనియర్ సిటిజన్ ఉంటున్నారు. మొత్తం మరణాల్లో 73శాతం మందికి ఇతర అనారోగ్య సమస్యలు ఉంటున్నాయని అగర్వాల్ వివరించారు.

వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి..

వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి..

ఎక్కువ రిస్క్ ఉన్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు. ఒక వేళ వారికి కరోనా లక్షణాలు కనిపిస్తే సమయానికి వైద్యం తీసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులు ఇంట్లోనే ఉంటూ రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని సూచించారు. అన్‌లాక్1 తరహా పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

వైరస్ విస్తృతి పెరిగింది..

వైరస్ విస్తృతి పెరిగింది..

ఇతర దేశాలతో పోలిస్తే సమూహ వ్యాప్తి బదులు వైరస్ విస్తృతి పెరిగిందని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త నివేదిత గుప్తా.. సమూహ వ్యాప్తి దశ మొదలైందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కరోనా విస్తృతి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఐసీఎంఆర్ సెరో సర్వే చేపట్టిందన్నారు. ఇంందులో భాగంగా 34000 మంది పరీక్షలు చేయించుకున్నారని, కొద్ది రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు.

పీక్ దశకు మనం చాలా దూరం..

పీక్ దశకు మనం చాలా దూరం..


కరోనా పీక్ దశకు మనం చాలా దూరంలో ఉన్నామని, మనం తీసుకుంటున్న చర్యలు సమర్థతంగా ప్రభావం చూపించాయని గుప్తా తెలిపారు. వారం రోజుల్లో వివరాలు అందజేస్తామని ఆమె చెప్పారు. రోజుకు సగటున 1.20లక్షల నమూనాలను పరీక్షిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాలేవీ కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించడం లేదన్నారు.

భారత్‌లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో ఇప్పటి వరకు 2,07,085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,01,040 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 1,00,205 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5829 మంది కరోనాతో మరణించారు.

English summary
India's Corona fatality rate per lakh population at 0.41% as against 4.9% globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X