వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగుతున్న కొత్త కేసులతో భారత్ విలవిల .. గత 24 గంటల్లో 8171 కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశం కరోనా కేసులతో విలవిలలాడుతుంది. నిత్యం పెరుగుతున్న కేసులు ఇండియాను ఆరోగ్య సంక్షోభంలోకి నెడుతున్నాయి . ఇక తాజా లెక్కల ప్రకారం ఇండియాలో కరోనా కేసులు 2 లక్షల మార్కుకు దగ్గరగా ఉంది. ఇండియా వరుసగా మూడవ రోజు 8,000 కేసులను నమోదు చేసింది . భారతదేశంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య 198,706 కు పెరిగింది.

Recommended Video

Coronavirus Cases in India Rise To 2 Lakh, 8,000 New Cases In 24 Hours

ఇండియాలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు: గడచిన 24 గంటల్లో 8392 కొత్త కేసులతో రికార్డుఇండియాలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు: గడచిన 24 గంటల్లో 8392 కొత్త కేసులతో రికార్డు

మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. ఆందోళనకరంగా పరిస్థితి

మహారాష్ట్రలో కంట్రోల్ లోకి రాని కరోనా .. ఆందోళనకరంగా పరిస్థితి

మహారాష్ట్రలో అత్యధిక తాజా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సోమవారం ఒక్క రోజే అతిపెద్ద కరోనా కేసులు పెరుగుదల కనిపిస్తుంది. అయితే, దేశ రాజధానిలో తాజా కరోనావైరస్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 204 కు పెరిగింది, ఇది ఇప్పటివరకు మూడవ అత్యధిక సంఖ్య. కరోనావైరస్ వల్ల భారతదేశంలో ఇప్పటివరకు 5,598 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా రోగులలో దాదాపు 2.8% శాతం మృతులుగా ఉన్నారు . మహారాష్ట్రలో గత 24 గంటల్లో 76 మంది మరణించారు.

 మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,361 కొత్త కేసులు నమోదు.. తమిళనాడు రెండో స్థానం

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,361 కొత్త కేసులు నమోదు.. తమిళనాడు రెండో స్థానం

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,361 తాజా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 1,413 కేసులు ముంబైలో నమోదయ్యాయి.దీంతో ముంబై కరోనావైరస్ కేసులు 40,000 దాటింది. రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ రోగుల సంఖ్య 70,013 గా ఉంది. కరోనావైరస్ కేసులు తమిళనాడులో సోమవారం ఒక్కరోజే భారీగా నమోదయ్యాయి. కరోనావైరస్ కేసులు 1,149 ఒక్కరోజే నమోదు అయ్యాయి .దీంతో మొత్తం కరోనా సంఖ్య 23,495 కు చేరుకుంది. మహారాష్ట్ర తరువాత అత్యధికంగా కరోనావైరస్ కేసులు తమిళనాడులో ఉన్నాయి.

 తగ్గుతున్న మరణాలు .. పెరుగుతున్న రికవరీలు

తగ్గుతున్న మరణాలు .. పెరుగుతున్న రికవరీలు

20 వేల మంది కరోనావైరస్ రోగులను నమోదు చేసిన మూడవ రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అయితే, రోజువారీ నమోదవుతున్న కొత్త కేసుల విషయంలో మాత్రం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధానిలో సోమవారం 990 తాజా కేసులు నమోదయ్యాయి. రాజధాని ఢిల్లీలో సోమవారం 50 మరణాలను నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీలో మరణాల సంఖ్య 523 కు చేరుకుంది.

రికవరీ రేటు ఒక వైపు పెరుగుతున్నప్పుడు, కేసుల మరణాలు మరోవైపు తగ్గుతోంది అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దేశంలో మరణాల రేటులో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. సాపేక్షంగా తక్కువ మరణాల రేటు నిఘా, సకాలంలో కేసు గుర్తింపు మరియు కేసుల క్లినికల్ నిర్వహణపై నిరంతరం దృష్టి పెట్టడం ద్వారా సాధ్యం అవుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో రాష్ట్రాల వారీగా తాజా కరోనావైరస్ కేసుల సంఖ్య

భారతదేశంలో రాష్ట్రాల వారీగా తాజా కరోనావైరస్ కేసుల సంఖ్య

మహారాష్ట్ర - 70,013

తమిళనాడు - 23,495
ఢిల్లీ - 20,834
గుజరాత్ - 17,200
రాజస్థాన్ - 8,980
మధ్యప్రదేశ్ - 8,283
ఉత్తర ప్రదేశ్ - 8,075
పశ్చిమ బెంగాల్ - 5,772
బీహార్ - 3,926
ఆంధ్రప్రదేశ్ - 3,783
కర్ణాటక - 3,408
తెలంగాణ - 2,792
జమ్మూ కాశ్మీర్ - 2,601
హర్యానా - 2,356
పంజాబ్ - 2,301
ఒడిశా - 2,134
అస్సాం - 1,390
కేరళ - 1,326
ఉత్తరాఖండ్ - 958
జార్ఖండ్ - 659
ఛత్తీస్‌గడ్ - 547
త్రిపుర - 420
హిమాచల్ ప్రదేశ్ - 340
చండీఘర్ - 294
మణిపూర్ - 83
లడఖ్ - 77
గోవా - 71
పుదుచ్చేరి - 70
నాగాలాండ్ - 43
అండమాన్ మరియు నికోబార్ దీవులు - 33
మేఘాలయ - 27
అరుణాచల్ ప్రదేశ్ - 22
దాదర్ నగర్ హవేలి - 3
సిక్కిం - 1

English summary
corona virus cases in india inched closer to the grim milestone of 2 lakh-mark. The states registered over 8,000 fresh cases for the third straight day. The total number of coronavirus patients in India rose to 198,706.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X