వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గంటల్లో 2 వేల కరోనా మృతులు, 3.36 శాతానికి చేరిన డెత్ రేట్, రికవరీ రేటు కూడా పెరిగింది..

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. ఈ నెల 3వ తేదీ నాటికి మరణాలు రేటు 2.8 శాతం ఉండగా.. అదీ బుధవారానికి 3.36 శాతానికి చేరింది. గత 24 గంటల్లో 2003 మంది చనిపోవడంతో మరణాల శాతం ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే ఈ శాతం తక్కువ కావడం కాస్త ఊరటనిచ్చే అంశం. మిగతా దేశాల్లో మరణాల రేటు 5 శాతంగా ఉంది. కానీ ఈ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అని కొన్ని ఆడిట్ కంపెనీలు పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.

1409 మంది ఇక్కడే

1409 మంది ఇక్కడే

మరణాల్లో మహారాష్ట్రలో 1409 మంది చనిపోగా.. ఢిల్లీలో 437 మంది చనిపోయారు. తమిళనాడులో 49, హర్యానాలో 18 మంది మృతిచెందారు. దేశంలోనే కాదు ఇటలీలో కూడా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అమెరికాలోని కొలరాడో మాదిరిగా స్పెయిన్ కూడా మరణాల సంఖ్యను తగ్గించుకుంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో మరణాల శాతం ఎక్కువగా ఉంది. అదీ బుధవారం 400 శాతం పెరిగి.. 2000 పైచిలుకు మంది చనిపోవడానికి దారితీసింది. మంగళవారం 470 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

రికవరీ రేటు కూడా

రికవరీ రేటు కూడా

మృతుల సంఖ్య మాదిరిగానే రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటివరకు 52.8 శాతం మంది కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 6 వేల 922 మంది కోలుకోగా.. కోలుకున్న మొత్తం సంఖ్య లక్ష 86 వేల 934కి చేరింది. లక్ష 55 వేల 227 మందికి వైరస్ కోసం చికిత్స అందిస్తున్నారు.

Recommended Video

#Lockdown : PM Modi Clarifies About Lockdown Extension
కొత్త ల్యాబ్‌లు

కొత్త ల్యాబ్‌లు


కరోనా వైరస్ పరీక్షలు చేసే ల్యాబ‌్‌లను కూడా గణనీయంగా పెంచారు. ప్రభుత్వ ల్యాబ్‌లు 674 ఉండగా.. మరో 250 ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతిచ్చారు. మొత్తం ప్రైవేట్ ల్యాబ్ ల సంఖ్య 924కి చేరింది. ఆ ల్యాబ్ లు లక్ష 63 వేల 187 మందిని పరీక్షించాయి. దీంతో పరీక్షించిన నమూనాల సంఖ్య 60 లక్షల 84 వేల 256కి చేరింది. ప్రపంచంలో అత్యధిక కరోనా వైరస్ సోకిన దేశాల్లో భారత్ నాలుగోస్థానంలో ఉంది.

English summary
2,003 deaths in one day has sharply increased India’s Covid-19 fatality rate to 3.36 per cent from 2.8 per cent on 3 June.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X