ఫిబ్రవరి 6 నాటికి కరోనా కేసులు పీక్, ఆర్ వాల్యూ తగ్గుతోంది: తాజా అధ్యయనంలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కేసులతోపాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజూ 3 లక్షలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నాటికి అత్యదిక కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని తాజా అధ్యయనం తెలిపింది.

ఫిబ్రవరి 6 నాటికి కరోనా కేసులు తారస్థాయికి..
దేశంలో ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమణ తీరును తెలిపే ఆర్-వాల్యూ(రీ-ప్రొడక్షన్ నెంబర్) తగ్గుముఖం పడుతున్నట్లు ఐఐటీ మద్రాస్ అధ్యయనం తేల్చింది. జనవరి 14-24 మధ్య ఆర్ వాల్యూ 1.57గా నమోదైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో 14 రోజుల్లో అంటే ఫిబ్రవరి 6 నాటికి దేశంలో కేసుల సంఖ్య తారస్థాయికి చేరుకుంటుందని ఐఐటీ మద్రాస్ పరిశోధకులు తేల్చారు.

క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఆర్ వాల్యూ
జనవరి 7-13 మధ్య ఆర్ వాల్యూ 2.2గా ఉండగా, 1-6వ తేదీల మధ్య 4గా ఉందని, డిసెంబర్ 25-31 మధ్య 2.9గా ఉన్నట్లు తెలిపారు. క్రమంగా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లుగా తమ పరిశోధనలో తేలిందని వెల్లడించారు. కాగా, ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ నీలేశ్ ఎస్ ఉపాధ్యాయ్ నేతృత్వంలోని గణిత విభాగం అధ్యయనం జరిగింది.

చెన్నై, ఢిల్లీలో భారీగా కేసులు
ఈ
పరిశోధన
వివరాల
ప్రకారం..
ముంబైలో
ఆర్
వాల్యూ
0.67గా,
ఢిల్లీలో
0.98గా,
చెన్నైలో
1.2గా,
కోల్‌కతాలో
0.56గా
ఉంది.
దీన్ని
బట్టి
చూస్తే
ముంబై,
కోల్‌కతాలో
కరోనా
విజృంభణ
ఇప్పటికే
తారస్థాయికి
చేరుకుందని
అసిస్టెంట్
ప్రొఫెసర్
జయంత్
ఝా
తెలిపారు.
ఢిల్లీ,
చెన్నైలో
మాత్రం
ఇంకా
భారీ
స్థాయిలో
కేసులు
వచ్చే
అవకాశం
ఉందన్నారు.

ఆర్ వాల్యూ అంటే..?
కాగా,
వైరస్
సోకిన
వ్యక్తి
తిరిగి
ఎంత
మందికి
వ్యాప్తి
చేస్తారనేది
ఆర్
వాల్యూగా
పరిగణిస్తారు.
ఉదాహరణకు
ఈ
విలువ
1
ఉంటే..
కరోనా
సోకిన
వ్యక్తి
మరొకరికి
వ్యాధి
అంటిస్తారన్న
మాట.
సాధారణంగా
ఆర్
వాల్యూ
ఒకటి
దాటితే
ప్రమాద
స్థాయికి
చేరుకున్నట్లే.
100
మందికి
కరోనా
సోకితే..
వారు
మరో
వంద
మందికి
వైరస్
ను
అంటించే
అవకాశం
ఉంటుంది.
ఆర్
వాల్యూ
పెరిగే
కొద్ది
ఈ
విధంగా
వైరస్
వ్యాప్తి
విస్తరిస్తూ
ఉంటుంది.
ప్రస్తుతం
దేశంలో
పాజిటివిటీ
రేటు
17.22
శాతం
నుంచి
17.78
శాతానికి
పెరిగింది.
ఫిబ్రవరి
6
వరకు
కరోనా
కేసులు
పెరగనున్నాయి.
ఆ
తర్వాత
తగ్గుముఖం
పట్టే
అవకాశం
ఉంది.