వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో గణనీయంగా తగ్గుతున్న కేసులు ..గత 24 గంటల్లో 60,471 కొత్త కేసులు, 2726 మరణాలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 60,471 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. వాటితో పాటు 2726 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 2,95,70,881 కు పెరిగింది. ఇప్పటి వరకు ఇందులో మహమ్మారి కారణంగా 3,77,031 మంది మరణించారు.

షాకింగ్ విషయం చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ .. సీజన్ తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం !!షాకింగ్ విషయం చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ .. సీజన్ తో సంబంధం లేకుండా కరోనా సోకే అవకాశం !!

దేశంలో ఒక రోజులో 100,000 కన్నా తక్కువ కేసులు నమోదు కావడం ఇది వరుసగా ఎనిమిదవ రోజు. జూన్ 8న, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 86,498 కొత్త కేసులను నివేదించింది, అంటే ఏప్రిల్ ఆరంభం నుండి ,66 రోజుల తరువాత మొదటిసారిగా జూన్ 8వ తేదీన 100,000 కన్నా తక్కువ నమోదయ్యాయి. అప్పటినుండి వరుసగా లక్ష కన్న తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇది కాస్త ఊరట కలిగించే అంశం .ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సోమవారం 1,751,358 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా, అంతకుముందు 24 గంటల వ్యవధిలో 14,92,152 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.

 India’s daily corona cases, deaths fall further to 60,471 and 2726

Recommended Video

#TOPNEWS: Low Pressure Over North Bay Of Bengal | Oneindia Telugu

ఐసిఎంఆర్ యొక్క తాజా డేటా ప్రకారం మొత్తం 38,13,75,984 నమూనాలను ఇప్పటివరకు పరీక్షించినట్లు వెల్లడించింది. గత కొన్ని రోజులుగా, రోజువారీ కేసుల సంఖ్య తగ్గినందున, వైరల్ వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ తో పాటుగా ఇతర పరిమితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ సడలింపులను ప్రకటించాయి. ఉదాహరణకు, జూన్ 14 న ఢిల్లీ విధించిన లాక్డౌన్ నుండి మూడవ దశ అన్‌లాక్ ప్రారంభించింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు కూడా కేవలం నైట్ కర్ఫ్యూకే పరిమితం అయ్యాయి.

English summary
India registered 60,471 cases of the coronavirus disease (Covid-19) in the last 24 hours, along with 2726 Covid-19 related deaths, the Union ministry of health and family welfare (MoHFW) said on Tuesday morning. With this, the national tally of coronavirus cases has risen to 29,570,881, including a related death toll of 377,031, Tuesday’s data showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X