ఇండియాలో వరుసగా రెండోరోజు ... కేసుల తగ్గుదల ... గత 24గంటల్లో 29,163 కొత్త కేసులు
భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులను భారతదేశం నమోదు చేసింది. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88.74 లక్షలకు చేరుకుంది. చివరిసారిగా భారతదేశం 30,000 కంటే తక్కువ కేసులను జూలై నెలలో నివేదించింది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు భారీగానే కేసులు నమోదు చేసిన భారత్ నిన్న, ఈరోజు తక్కువ కేసులను నమోదు చేసింది.
కరోనా వ్యాక్సిన్ ఇప్పటికి రాలేదు .. ఇక ముందు రాదు : బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో రోజు వరుసగా కరోనా కేసుల తగ్గుదల ..గడచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులు
కేసులలో తగ్గుదల వారాంతంలో తక్కువ కరోనా పరీక్షల కారణంగా నమోదైనట్లుగా తెలుస్తుంది. గడచిన 24 గంటల్లో 29,164 కొత్త కేసులను నమోదు చేసింది. వాస్తవానికి, గత నాలుగు రోజులుగా కరోనా పరీక్షలు 10 లక్షల కన్నా తక్కువగా చేయడంతో, తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనట్లుగా భావిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మొత్తం కేసులు 88,74,291 కాగా అందులో 4,53,401 క్రియాశీల కేసులు ఉన్నట్లుగా సమాచారం. కరోనా నుండి కోలుకున్న వారు 82,90,371 మంది కాగా , ఇప్పటి వరకు కరోనా కారణంగా 1,30,519 మంది మరణించారు .

మూడు రోజుల్లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 450 లోపే
వరుసగా మూడు రోజుల్లో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 450 లోపే ఉండటం గమనార్హం .
దేశం ఇప్పుడు ఫస్ట్ వేవ్ ను దాటినప్పటికీ, రాబోయే శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరిగినప్పుడు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరోమారు కరోనా ఉప్పెనకు సిద్ధం కావాల్సిందే . కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ల పెరుగుదల దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలు నివేదిస్తున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఢిల్లీకి అత్యధిక నష్టం వాటిల్లింది.

ఢిల్లీ లోనే అత్యధికంగా కరోనా కేసులు ..
ఢిల్లీలో గత 24 గంటల్లో 99 మరణాలు మరియు 3,797 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో థర్డ్ వేవ్ కొనసాగుతుందని చెప్తున్న ఢిల్లీ ప్రభుత్వం త్వరలోనే అది తగ్గే అవకాశం ఉందంటూ భరోసా ఇస్తుంది.
దేశంలోని మొత్తం కేసులలో ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో దాదాపు 49 శాతం కేసులు ఉన్నాయి. ఢిల్లీ తరువాత, మిగిలిన రాష్ట్రాలు రోజుకు 3,000 మరియు 2,100 కేసులను నమోదు చేశాయి. కోవిడ్ సంబంధిత మరణాలలో దాదాపు 58 శాతం ఢిల్లీలోనే జరిగాయి. తాజాగా మహారాష్ట్ర లో 60, పశ్చిమ బెంగాల్ లో 53, ఛత్తీస్ గడ్ లో 26 , పంజాబ్ లో 22 మరణాలు సంభవించాయి.