వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో 'ఇండియాస్ డాటర్' నిషేధంపై కిరణ్ బేడి ఏమన్నారు..?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2012లో న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనపై లెస్లి ఉడ్విన్ ‘ఇండియాస్ డాటర్' పేరుతో బిబిసి కోసం తీసిన డాక్యుమెంటరీపై నిషేధం విధించడాన్ని మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ తప్పుబట్టారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కిరణ్ బేడీ అక్కడ ప్రదర్శితమైన ‘ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని వీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత్‌లో డాక్యుమెంటరీపై నిషేధం విధించడం పొరబాటు చర్యేనని అన్నారు.

Kiran Bedi

అసలు డాక్యుమెంటరీలో ఏముందో చూడకుండా, విశ్లేషించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఆడవారి పట్ల మగవారి మైండ్ సెట్‌ను కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించిన ఆ డాక్యుమెంటరీతో కొందరి మనసైనా మారే అవకాశం ఉందని తెలిపారు.

ఇంతకీ వీడియోలో ఏముంది?

60 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోలో భారత్‌లో ఆడపిల్లకు రక్షణ లేదనే నిజాన్ని చెప్పింది. ఎన్నో వందల ఏళ్లనుంచి భారత్‌లో ఉన్న పురుషాధిక్యతను చూపింది. శిక్ష పడినా పశ్చాత్తాపం రాలేదనే యదార్ధాన్ని, ఆడదాన్ని కేవలం వంటింటి కుందేలుగానే భావిస్తారనే అసలు సత్యాన్ని చూపించింది.

English summary
Former top cop and BJP leader Kiran Bedi has said that the controversial BBC documentary on the Delhi gangrape case need not have been banned by the government without watching and analysing it, as it meets the "needs of crime prevention strategies" in chauvinistic segments of Indian society.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X