వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాగే ముందుకు: మోడీ సర్కారులో ఉత్సాహాన్ని నింపిన ప్రపంచ బ్యాంక్, 7.3శాతం గ్రోత్

|
Google Oneindia TeluguNews

Recommended Video

7.3% గ్రోత్ 2018 : భారత్‌ను పోగిడేస్తున్న ప్రపంచ బ్యాంక్

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారులో కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రపంచ బ్యాంక్. నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది.

ఆ తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. అదే జీఎస్టీ అమలు. జీఎస్టీతో దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నప్పటికీ.. ఒక్కసారిగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ నేపథ్యంలోనే భారత వృద్ధిరేటుపై ప్రపంచ బ్యాంక్ సానుకూలంగా స్పందించింది.

అత్యంత వేగమైన అభివృద్ధి

అత్యంత వేగమైన అభివృద్ధి

భారతదేశంలో అమలవుతున్న సంస్కరణలు దేశ వృద్ధికి ఎంతో తోడ్పడతాయని పేర్కొంది. అంతేగాక, ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తోందని భారత్‌ను కొనియాడింది. ‘భారత ప్రభుత్వం అద్భుతమైన సంస్కరణలను అమలు చేస్తోంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ముందు వరుసలో నిలిచింది' అని ప్రపంచ బ్యాంక్ మంగళవారం పేర్కొంది.

7.30శాతం వృద్ధిరేటుతో..

7.30శాతం వృద్ధిరేటుతో..

అంతేగాక, భారత వృద్ధిరేటు 2018లో 7.3శాతంగా ఉండనుందని వెల్లడించింది. ఆ తర్వాతి రెండు సంవత్సరా(1919, 1920ల్లో వృద్ధిరేటు 7.5గా ఉండనుందని పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీతో ఏర్పడిన ఆటుపోట్లను తట్టుకొని 2017లో 6.7శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ 2018ను వాషింగ్టన్‌లో మంగళవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది.

రాబోయే కాలం భారత్‌‌దే

రాబోయే కాలం భారత్‌‌దే


‘వచ్చే దశాబ్ద కాలంలో ఇతర అభివృ చెందుతున్న దేశాలకంటే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేయనుంది. అందుకు స్వల్పకాలిక ఫలితాలను పట్టించుకోనవసరం లేదు. రాబోయే కాలంలో భారత్ పెద్ద ఎత్తున అభివృద్ధిని నమోదు చేయనుంది' అని ప్రపంచ బ్యాంక్ డెవలప్‌మెంట్ ప్రాస్పెక్ట్ గ్రూప్ డైరెక్టర్ అయ్హన్ కోస్ తెలిపారు.

వృద్ధిరేటు సానుకూలం

వృద్ధిరేటు సానుకూలం

గత మూడు సంవత్సరాల్లో సాధించిన వృద్ధిరేటు సానుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు మంచి పెట్టుబడులకు అవకాశాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. లేబర్ మార్కెట్ సంస్కరణలు మెరుగయ్యాయని, అలాగే విద్యా, ఆరోగ్యం విభాగాల్లో కూడా సంస్కరణలు బాగా అమలవుతున్నాయని ప్రశంసించారు.

అంచనాలకు మించి..

అంచనాలకు మించి..

నిరుద్యోగితను తొలగించేందుకు కూడా భారత్ సంస్కరణలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు. ప్రైవేట్ సెక్టార్లో పెట్టుబడులు పెరగడంతో ఉద్యోగావశాలు పెరుగుతున్నాయని తెలిపారు. 2018లో భారత్ అంచనాలకు మించి మంచి ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. వచ్చే పదేళ్లలో కూడా భారత వృద్ధిరేటు 7శాతానికి తగ్గబోదని స్పష్టంచేశారు.

ఆటుపోట్లు తాత్కాలికమే.. ఇలాగే ముందుకు

ఆటుపోట్లు తాత్కాలికమే.. ఇలాగే ముందుకు

జీఎస్టీ అమలు చేయడం అనేది కీలక పరిణామమని, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు ఆ వ్యవస్థను మరింత పటిష్టపరిచిందని కోస్ తెలిపారు. జీఎస్టీ అమలులో ఉన్న ఆటుపోట్లను భారత ప్రభుత్వం గుర్తించి అందుకు తగిన చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని అన్నారు. భారత్‌కు తమ ముందున్న సవాళ్లు ఏంటో తెలుసని అన్నారు. సంస్కరణల కారణంగా తాత్కాలిక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ భారత్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతుందని కోస్ తెలిపారు. ఇలాంటి సంస్కరణలు భారత వృద్ధిరేటును పెంచుతాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఇలాగే ముందుకు సాగాలని సూచించారు.

English summary
Since November 8, 2016, after the controversial demonetisation was announced by Prime Minister Narendra Modi, the ruling Bharatiya Janata Party (BJP) government has come under severe scrutiny for failing to uplift the country's economy because of its "hasty decisions".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X