వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోలుకుని డిశ్చార్జ్ అయిన భారత్ తొలి కరోనావైరస్ పేషెంట్.. చికిత్స తెలిస్తే వావ్ అంటారు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌లో తొలి కరోనావైరస్ బాధితుడు కోలుకున్నాడు. ఇన్ని రోజులు వివిధ రకాలుగా చికిత్స తీసుకుంటున్నప్పటికీ ట్రీట్‌మెంట్‌లో కాస్త మార్పులు చేయడంతో బాధితుడు కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. ఇంతకీ ఆ చికిత్స ఏమిటో కాదు.. గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ వైద్యులు చెబుతున్న ప్లాస్మా థెరపీ. అంటే కరోనావైరస్ సోకిన వ్యక్తి కోలుకున్న తర్వాత అతని రక్తంను సేకరించి కొత్త కరోనావైరస్ పేషెంట్‌కు ఎక్కిస్తారు. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇస్తోందని ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి కరోనావైరస్ బారిన పడి కోలుకున్న పేషెంట్లు రక్తదానం చేయాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం కోరుతోంది.

 శ్వాసకోస ఇబ్బందులతో హాస్పిటల్‌లో చేరిక

శ్వాసకోస ఇబ్బందులతో హాస్పిటల్‌లో చేరిక

ఇక భారత్‌లోనే తొలి కరోనావైరస్ కేసుగా నమోదైన వ్యక్తి ప్లాస్మా థెరపీ ట్రీట్‌మెంట్‌తో కోలుకున్నాడు. సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితుడికి ఏడు రోజుల క్రితమే వెంటిలేటర్ తీసేశారు వైద్యులు. ఏప్రిల్ 4వ తేదీన ఈ వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. కరోనావైరస్ లక్షణాలు, శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో మ్యాక్స్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆ రోజు నుంచి అతని ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. దీంతో పరిస్థితి చక్కబడేందుకు ఆయనకు ఆక్సిజన్ అందించారు. అనంతరం ఆ వ్యక్తికి న్యూమోనియా వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన ఆ వ్యక్తిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. ఇక పేషెంట్ ఆరోగ్య విషయంలో మెరుగు అనేది కనిపించకపోవడంతో ప్లాస్మా థెరపీ చేయాల్సిందిగా వైద్యులను కోరారు.

 దాతను ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు

దాతను ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు

వెంటనే బాధితుడి కుటుంబ సభ్యులు అదే బ్లడ్ గ్రూప్ కలిగిన దాతను తీసుకొచ్చారు. దాత ఒక మహిళ. అయితే దాతకు కూడా ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఆమెను కూడా హాస్పిటల్‌లో ఉంచారు. అయితే ఆమెకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం ఆమె నుంచి సేకరించిన రక్తంతో కరోనావైరస్ బాధితుడికి ప్లాస్మా థెరపీ నిర్వహించారు వైద్యులు. ఒక దాత 400 మిల్లీలీటర్ల రక్తం దానం చెయ్యొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ రక్తం ఇద్దరి ప్రాణాలను కాపాడుతుందని వివరించారు.

 24 గంటల్లో రెండు సార్లు నెగిటివ్

24 గంటల్లో రెండు సార్లు నెగిటివ్

ఇక ప్లాస్మా థెరపీ చికిత్స తీసుకున్న కరోనావైరస్ బాధితుడి ఆరోగ్యం మెరుగుపడింది. ఏప్రిల్ 18వ తేదీన వెంటిలేటర్‌ను తొలగించారు. సొంతంగా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టినట్లు వైద్యులు చెప్పారు. ఇక మరో గదికి ఆయన్ను ఉంచారు. గత 24 గంటల్లో రెండు సార్లు కరోనావైరస్ పరీక్షలు చేయగా రెండు సార్లు నెగిటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇక పూర్తిగా కోలుకున్న వ్యక్తి ఆదివారం డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మరో రెండు వారాల పాటు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండనున్నాడు బాధితుడు.

Recommended Video

Coronavirus Update : High Tension, 80% Asymptomatic Covid Cases In India

English summary
The first patient who was administered convalescent plasma therapy on compassionate grounds in Delhi has now fully recovered and was discharged on Sunday with a promising prognosis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X