వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్‌కు కరోనా వైరస్..? కోల్‌కతా ఐసోలేషన్ వార్డులో చికిత్స..

|
Google Oneindia TeluguNews

వైరస్ అంటే వెన్నులో వణుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ, ఎవరితో, ఎలా వస్తుందో తెలియడం లేదు. భారతదేశ తొలి నౌకాదళ మహిళ పైలట్‌కు కూడా కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి.. ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచారు.

వెకేషన్ కోసం ఇటీవల ఆమె కొలంబో వెళ్లి వచ్చారు. ఆ తర్వాతే కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. జ్వరం, దగ్గు రావడంతో కోల్ కతాలోని ఐడీ అండ్ బీజీ ఆస్పత్రిలోని ఐసోలేసన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆమె రక్త నమూనాలను పరీక్షల కోసం తీసుకున్నారు. అయితే కోల్‌కతాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 128కి చేరగా.. ముగ్గురు చనిపోయారు. వైరస్ తీవ్రత నేపథ్యంలో కొన్నిరాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. పబ్‌లు, బార్లు, సినిమా థియేటర్లు కూడా క్లోజ్ చేశారు.

India’s first marine woman pilot in quarantine in Kolkata..

వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన మహిళలకు అందజేసే నారీశక్తి అవార్డును కూడా సదరు మహిళ స్వీకరించారు. గతేడాది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డును ప్రదానం చేశారు. 2011లో మహిళ కోల్ కత పోర్ట్ ట్రస్ట్‌లో విధుల్లో చేరి... పైలట్‌గా ప్రమోషన్ పొందారు. 2019లో నారీ శక్తి అవార్డును స్వీకరించారు.

English summary
India’s first woman marine pilot has been rushed to the ID and BG Hospital in Kolkata with fever and cough and is suspected to be coronavirus hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X