వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో తొలి కార్పొరేట్ రైలు ‘తేజస్’: ప్రత్యేకతలెన్నో.. త్వరలో దేశ వ్యాప్తంగా!

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే తొలి ప్రైవేటు రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్'ను ప్రారంభించారు. ఈ రైలు రైల్వే శాఖకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. లక్నో-న్యూఢిల్లీ మార్గంలో ప్రయాణికులను చేరవేస్తుంది తేజ్ ఎక్స్‌ప్రెస్ రైలు.

స్వర్ణ శతాబ్ది కంటే వేగంగా..

స్వర్ణ శతాబ్ది కంటే వేగంగా..

తేజస్ ఎక్స్‍ప్రెస్ రైలుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కారణంగా లక్నో-న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటే.. ఈ తేజస్ 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ రైలుకు కాన్పూర్, ఘజియాబాద్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంది.

రూ. 25లక్షల బీమా సౌకర్యం

రూ. 25లక్షల బీమా సౌకర్యం


కాగా, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజ్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లించడం జరుగుతుంది. అంతేగాక, ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు రూ. 25లక్షల ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వసతులున్నాయి.

మరిన్ని మార్గాల్లోనూ..

మరిన్ని మార్గాల్లోనూ..

తేజస్ ఎక్స్‌ప్రెస్ చైర్ కారుకు రూ. 1280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ. 2450గా ధరను నిర్ణయించారు. ఈ రైలు విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేటు రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్వే విభాగాలకు సూచనలు చేసింది.

తొలి కార్పొరేట్ రైలు కేటాయింపుపై యోగి..

తొలి కార్పొరేట్ రైలు కేటాయింపుపై యోగి..


కాగా, తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు లాంటి రైళ్లు దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా విస్తారించాలని ప్రారంభోత్సవం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తొలి ప్రైవేటు రైళ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే తొలి కార్పొరేట్ రైలును ఉత్తరప్రదేశ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి నడిపేందుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు.

సెమీ బుల్లుట్ రైలు నడపాలంటూ..

సెమీ బుల్లుట్ రైలు నడపాలంటూ..

భారత రైల్వే శాఖ చౌక ధరల్లోనే భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఆగ్రా-వారణాసి మధ్య సెమీ బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అంగీకరిస్తే భూసేకరణకు అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే లక్నో-అలహాబాద్, లక్నో-గోరఖ్‌పూర్ మధ్య హైస్పీడ్ రైళ్లు నడపాలని ఈ సందర్భంగా కేంద్రానికి, రైల్వే శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ అవసరమని యోగి అన్నారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath flagged off the Tejas Express, the country's first "private" train run by its subsidiary IRCTC, on the Lucknow-New Delhi route.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X