వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతదేశంలో మొదటి హిజ్రా పోలీసు అధికారి: చెన్నై సిటీలో ఉద్యోగం, న్యాయపోరాటం చేసి !

భారతదేశ చరిత్రలోనే మొదటిసారి పోలీసు అధికారిగా ఓ హిజ్రా బాధ్యతలు స్వీకరించింది. తమిళనాడులోని చెన్నై నగరంలోని చూలై మేడు పోలీస్ స్టేషన్ లో ప్రితికా యాషిని (24) లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు .

|
Google Oneindia TeluguNews

చెన్నై: భారతదేశ చరిత్రలోనే మొదటిసారి పోలీసు అధికారిగా ఓ హిజ్రా బాధ్యతలు స్వీకరించింది. తమిళనాడులోని చెన్నై నగరంలోని చూలై మేడు పోలీస్ స్టేషన్ లో ప్రితికా యాషిని (24) లా అండ్ ఆర్డర్ ఎస్ఐగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది. పోలీసు కావాలనే తన కోరిక నేటికి తీరిందని ప్రితికా యాషిని అంటోంది.

సేలం జిల్లాకు చెందిన ప్రితికా యాషిని తమిళనాడు పోలీసు శాఖలో ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే పోలీసు శాఖ నుంచి హిజ్రా ప్రితికా యాషిని నిరాదారణ ఎదురైయ్యింది. మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ ను ఆశ్రయించిన ప్రితికా యాషిని న్యాయపోరాటం చేసింది.

India's first transgender police officer Prithiki Yasini appointed as SI in Chennai

ప్రితికా యాషినికి పోలీసు శాఖలో ఉద్యోగం సంపాధించుకోవడానికి అవకాశం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాత పరీక్షలు, దేహదారుడ్య పరీక్షల్లో ప్రితికా యాషిని ఉత్తీర్ణత సాధించింది. కొన్ని నెలల పాటు ధర్మపురిలోని పోలీసు శిక్షణా కేంద్రంలో శిక్షణ పోందింది.

ప్రితికా యాషిని చివరికి చెన్నై నగరంలోని చూలై మేడు పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించింది. పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ శివకుమార్, మరో ఎస్ఐ తిలకవతి ప్రితికా యాషినికి స్వాగతం పలికారు. ప్రితికా యాషిని ఇతర హిజ్రాలకు ఆదర్శంగా నిలిచారని సాటి హిజ్రాలు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

English summary
India's first transgender police officer Prithiki Yasini appointed as SI in Chennai Choolaimedu police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X