వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత తొలి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య కన్నుమూత

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: భారతదేశంలో తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కంచన్ చౌదరి భట్టాచార్య అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1973 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన భట్టాచార్య.. 2004లో ఉత్తరాఖండ్ డీజీపీగా నియమితులై చరిత్ర సృష్టించారు. ఆమె అక్టోబర్ 31, 2007లో రిటైరయ్యారు.

రిటైరైన తర్వాత ఆమె రాజకీయాల్లో ప్రవేశించారు. హరిద్వార్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 2014లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఓటమిపాలవడంతో పార్లమెంటు దిగువసభలో అడుగుపెట్టలేకపోయారు కంచన్ చౌదరి.

Indias First Woman DGP Kanchan Chaudhary Bhattacharya Dies

భట్టాచార్య మృతి పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం ప్రకటించారు. తొలి మహిళా డీజీపీగా చరిత్ర సృష్టించిన కంచన్ చౌదరి భట్టాచార్య మరణవార్తను తనను బాధకు గురిచేసిందన్నారు. డీజీపీగా రిటెరైన తర్వాత కూడా ఆమె ప్రజా సేవ చేశారని అన్నారు. ఆమెను తామంతా మిస్ అవుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో తెలిపారు.

కంచన్ చౌదరి భట్టాచార్య సేవలను ఉత్తరాఖండ్ పోలీసు శాఖ గుర్తు చేసుకుంది. తమ మార్గదర్శకుల్లో ఒకరైన చౌదరి మృతి తమను ఆవేదనకు గురిచేసందంటూ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మనసున్న అధికారి అంటూ కొనియాడింది. ఆమె ఎన్నో అవార్డులను సొంతం చేసుకుందని ఉత్తరాఖండ్ పోలీసు శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

English summary
The first woman Director General of Police (DGP), Kanchan Chaudhary Bhattacharya, died in Mumbai on Monday night following an illness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X