వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణంగా పడిపోయిన జీడీపీ: రికార్డు స్థాయికి క్షీణత: కేవలం 4.5 శాతం మాత్రమే నమోదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూలై - సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. గత ఆరేళ్లలో ఎప్పుడూ లేనంతగా 4.5శాతానికి పడిపోయింది. గతేడాది అంటే 2018-19 రెండో క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 2.6 శాతం పాయింట్ల మేరా పడిపోయింది. గతేడాది రెండో త్రైమాసికంలో జీడీపీ 7.1శాతంగా ఉన్నింది. ఇక ఎనిమిది ప్రధాన రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జీడీపీ సంఖ్యలను విడుదల చేసింది.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) తగ్గిందంటే ఎవరిపై అధిక ప్రభావం చూపుతుంది..?

ఎనిమిది ప్రధాన రంగాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన జీడీపీ సంఖ్యలో ఆరు ప్రధాన రంగాలు అక్టోబర్ నెలలో భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. బొగ్గు రంగం ప్రధానంగా దెబ్బతిన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దాదాపు 17.6శాతం మేరా తగ్గినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 2019-20 తొలి త్రైమాసికంలో జీడీపీ 5శాతంగా ఉన్నిందని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఆరేళ్లలో నమోదైన అతి తక్కువ జీడీపీ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Indias GDP falls to a six yeal low to 4.5 percent

తాజాగా విడుదలైన జీడీపీని పరిశీలిస్తే ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల నుంచి భారత్ తొలిగినట్లుగానే చెప్పుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చైనాకు ధీటుగా భారత ఆర్థిక శక్తి ఎదుగుతోందనే వాదనకు ఇకపై ఛాన్స్ ఉండదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
2018-19లో నాల్గవ త్రైమాసికం, 2019-20 తొలి త్రైమాసికాల్లో భారత వృద్ధి రేటు చైనా వృద్ధిరేటు కంటే తక్కువగా ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది.

ఇక భారత వృద్ధి రేటు తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో వృద్ధి రేటు తగ్గడం,పెట్టుబడులు, ఎగుమతులు కూడా క్రమంగా తగ్గుదల నమోదు చేయడం వంటి అంశాలు కారణాలుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో ఉత్పత్తులను ఉత్పత్తి చేసేందుకు డబ్బులు లేకపోవడం అంటే రుణాలు పుట్టకపోవడం ప్రధానమైన కారణంగా చెబుతున్నారు నిపుణులు. అదే సమయంలో మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం కూడా విస్మరించలేమని చెబుతున్నారు. మార్కెట్లకు రుణాలు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ అవేమీ జీడీపీని ప్రభావితం చేయలేకపోయాయని అధికారిక జీడీపీ లెక్కలు చూస్తే అర్థమవుతోందని చెప్పారు.

English summary
The Gross Domestic Product growth fell to 4.5 per cent in the second quarter (July-September) of the year 2019-20. This is a fall of 0.5 per cent points compared to the last quarter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X