వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంచలనం: వేతనాలు తగ్గించుకోండి.. లేదంటే ఇంటికే: ఉద్యోగులకు జెట్ ఎయిర్ వేస్ లేఖ

దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్‌లైన్స్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ పైల

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : దేశీయ రెండో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 30-35 శాతం వేతనాలను తగ్గించుకోవాలని, లేదంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లాలని ఈ ఎయిర్‌లైన్స్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ పైలెట్లను ఆదేశిస్తోంది.

ఒకవైపు ఇండిగో, స్పైస్ సెట్ విమానయాన సంస్థల నుంచి తీవ్ర పోటీ, మరోవైపు గల్ఫ్‌ ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆదాయం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగులకు వేతన కోత చేపడుతోంది.

India's Jet Airways cutting junior pilot pay to trim costs: sources

వ్యయాల కోతలో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ ఆదేశాలు జారీచేస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ నెల మొదట్లోనే ప్రతిపాదిత జీతం, వేతనాల కోతకు సంబంధించి ఆదేశాలు జారీచేస్తూ పైలెట్లకు లేఖలు రాసిందని తెలిసింది.

ఎక్కువగా నౌకాశ్రయం కార్యకలాపాలపై దృష్టిపెట్టడం, తమ నెట్‌వర్క్‌ను హేతుబద్దీకరణ చేసుకోవడం మూలాన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇలాంటి చర్యలను తీసుకుంటుందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

ఆగస్టు నుంచి వేతన కోత ప్రతిపాదనలు అమల్లోకి రాబోతున్నాయని, ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 400 మంది పైలెట్లు వరకు ప్రభావితం కాబోతున్నారని తెలిసింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌ పాక్షికంగా యూనిటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్‌ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ తలకుమించిన వ్యయాలతో సతమతమవుతోంది.

మరోవైపు తక్కువ ధరల క్యారియర్స్‌ ఇండిగో, స్పైస్‌జెట్‌ నుంచి విపరీతమైన పోటీ నెలకొంటోంది. ఆయిల్‌ రిచ్‌ గల్ఫ్‌ ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో, అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

English summary
Jet Airways (JET.NS), India's second-largest airline by market share, plans to slash pay of dozens of its junior pilots by as much as 50 percent in a cost-cutting move that could impact up to 400 pilots, according to two sources and letters seen by Reuters. The airline, in letters sent to pilots earlier this month, has proposed they either take 30-50 percent salary and stipend cuts, or quit, saying it was forced to take such steps as it was "intensely focused on fleet and network rationalisation". The measures are to be implemented from August 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X