వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: 2018లో ఐటీలో మెరుగైన ఉద్యోగావకాశాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు ఇక శుభవార్త. క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు ఊపందుకుంటుడటంతో 2018లో ఉద్యోగావకాశాలు మెండుగా వెల్లువెత్తే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలుటెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు

కొంత కాలంగా సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా సాగుతోంది. ఈ తరుణంలో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎప్పుడు తాము ఉద్యోగాలను కోల్పోతామనే భయంలో ఉన్నారు.

టెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలుటెక్కీలకు శుభవార్త: ఐఐటీ చెన్నైలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్, ధిగ్గజ కంపెనీలు

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకొన్న మార్పుల కారణంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఖర్చును తగ్గించుకొనే పనిలో పడ్డాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి.

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల జోరు

క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల జోరు

ఇటీవల కాలంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల జోరు పెరిగింది. దీంతో 2018 సంవత్సరంలో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనాతో ఉన్నారు. ఐటీ రంగంలో నియామకాల ప్రక్రియ జోరందుకుని జాబ్‌ మార్కెట్ మునుపటి కళ సంతరించుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

 ఉద్యోగావకాశాలపై సానుకూల సంకేతాలు

ఉద్యోగావకాశాలపై సానుకూల సంకేతాలు

ఐటీ రంగంలో జాబ్‌ ఆఫర్లు పెరగడంతో పాటు వేతన స్ధాయిలు, భిన్న రిక్రూటర్లు, ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్ల వంటి అన్ని విభాగాల్లోనూ మెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అన్ని క్యాంపస్‌లలో జాబ్‌ ఆఫర్ల ఊపు కొనసాగుతుండటం సానుకూల సంకేతాలు పంపుతోంది.

 పెరుగుతున్న ఉద్యోగావకాశాలు

పెరుగుతున్న ఉద్యోగావకాశాలు

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ నియామకాల కోసం 90 ఇంజనీరింగ్‌ కాలేజ్‌లు, బిజినెస్‌ స్కూల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఐఐటీ బాంబేలో అంతర్జాతీయ ఆఫర్లు 2016లో 50 నుంచి ఈ ఏడాది 60కి పెరిగింది.. మరోవైపు అమెరికాకు చెం‍దిన క్లౌడ్‌ డేటా కంపెనీ రుబ్రిక్‌, ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఆప్టివర్‌, బ్రిటన్‌ కంపెనీ హల్మా తదితర సంస్థలు తొలిసారిగా భారత్‌ క్యాంపస్‌లలో నియామకాలు చేపడుతున్నాయి.

 అమెరికా, యూరప్ కంపెనీల ఆసక్తి

అమెరికా, యూరప్ కంపెనీల ఆసక్తి

అమెరికా, యూరప్‌కు చెందిన బహుళజాతి సంస్థలతో పాటు జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌ల నుంచి ఆసియా కంపెనీలు భారత ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్‌ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ పలు సంస్థలతో కలిసి నిర్వహించన అథ్యయనంలోనూ జాబ్‌ మార్కెట్‌లో స్ధబ్థత వీడి ఉత్తేజం నెలకొన్నట్టు వెల్లడైంది.

 స్టార్టప్ కంపెనీలు కూడ రిక్రూట్‌మెంట్లు

స్టార్టప్ కంపెనీలు కూడ రిక్రూట్‌మెంట్లు

ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌, కన్సల్టింగ్‌ రంగాల్లో నియామకాలు ఊపందుకొన్నాయి. ​కాగ్నిజెంట్‌, ఐసీఐసీఐ , డెలాయిట్‌, క్యాప్‌జెమిని, విప్రో, అమెజాన్‌, ఈవై, హెచ్‌సీ టెక్‌, యాక్సెంచర్‌, కేపీఎంజీలు టాప్‌ రిక్రూటర్స్‌గా ఉన్నాయి. దీంతో 2018లో ఉద్యోగావకాశాలు ఐటీ రంగంలో మెండుగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.

English summary
campus placements signal green show spurt, india's job market set to turn the corner in 2018, new job offers for techies in 2018,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X