• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాతో ఇండియా తాజా ఘర్షణలకు మూడేళ్ళ క్రితమే బీజం పడింది:ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పిన చైనా నిపుణురాలు

|

భారత్-చైనా సరిహద్దు మధ్య తాజా ఘర్షణలకు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు మూడేళ్ల క్రితమే బీజం పడిందా? 2017 నుండి చైనా భారత్ ను టార్గెట్ చేయాలని చూస్తోందా? అప్పట్లో చైనా దురాక్రమణను ధీటుగా తిప్పికొట్టిన భారత్ పై నాటి నుండి చైనా గుర్రుగా ఉందా? అంటే అవును అని చెప్తున్నారు చైనా నిపుణురాలు. భారత్ చైనాల మధ్య తలెత్తిన వివాదం ఈనాటిది కాదని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చైనా వక్రబుద్ధి .. భారత వెబ్ సైట్లపై చైనా హ్యాకర్ల పంజా ..300 శాతంపెరిగిన దాడులు

తాజాగా ఘర్షణలకు 2017 లోనే బీజం

తాజాగా ఘర్షణలకు 2017 లోనే బీజం

చైనా ఎక్స్ పర్ట్, యూఎస్ లోని స్టిమన్స్ సెంటర్ లో తూర్పు ఆసియా ప్రోగ్రాం కో-డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న యన్ సన్ తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ చైనాల మధ్య ఘర్షణలకు మూడేళ్ల క్రితమే బీజం పడిందని చెప్పారు. 2017 లో ఇండియా చైనా భూటాన్ ట్రై జంక్షన్ ప్రాంతంలో రహదారి నిర్మాణం చేపట్టాలని చూసిన సమయంలో చైనాను భారత్ అడ్డుకుంది. తమ ప్రాంతంలోకి చొచ్చుకొని వస్తున్నారని రహదారి నిర్మాణానికి అంగీకరించలేదు.

 డోక్లాంవివాదం నాటి నుండే భారత్ విషయంలో చైనా వ్యూహం మార్పు

డోక్లాంవివాదం నాటి నుండే భారత్ విషయంలో చైనా వ్యూహం మార్పు

2017 లో డోక్లాం వివాదంతో భారత్ తీరుపై చైనా తీవ్ర అసహనానికి గురి అయింది. ఇక అప్పటినుండి భారత్ తమకు సవాల్ విసరడం పై చైనా తన వ్యూహాన్ని మార్చుకున్నదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యన్ సన్. ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న లడఖ్ వద్ద ఉన్న వాస్తవాధీన రేఖకు ఇరువైపుల ప్రాంతాలపై ఆధిపత్యం కోసం ఎన్నో ఏళ్లుగా వివాదాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఇండియానే చైనాను వెన్నుపోటు పొడిచిందన్న భావనలో చైనా

ఇండియానే చైనాను వెన్నుపోటు పొడిచిందన్న భావనలో చైనా

భూటాన్ కు దగ్గరలోని బంజరు భూములలో తమ నిర్మాణాలను ఇండియా వ్యతిరేకించడంతో చైనా షాక్ కు గురైందని పేర్కొన్న ఆమె భారత్ చర్యలు చైనాకు ఆమోదయోగ్యం కావని పేర్కొన్నారు. ఇండియా విషయంలో చైనీయుల ఆలోచన తమ దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్నదనే భావన లోనే ఉన్నారని యన్ సన్ అభిప్రాయపడ్డారు.నాడు డోక్లాం వివాదం దాదాపు 70 రోజులకు పైగా కొనసాగుతుందని అసలు ఆలోచించలేదని యన్ సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  #IndiaChinaStandoff:సరిహద్దుల్లో భారత్ T-90 భీష్మా యుద్ధ ట్యాంకర్లు.. సమయం లేదు చైనా.. శరణమా రణమా ?
  చైనాకు ఇండియాపై ప్రతీకార వాంఛ అప్పటి నుండేనా

  చైనాకు ఇండియాపై ప్రతీకార వాంఛ అప్పటి నుండేనా

  అయితే ప్రస్తుతం గ్యాల్వాన్ లోయ, పాంగాంగ్ సో సరస్సు విషయంలో జరుగుతున్న ఘర్షణతో చైనా తీవ్ర అసహనంతో ఉందని, ఇండియా తమను ఇంతగా వ్యతిరేకిస్తుందని చైనా ఊహించలేదని పేర్కొన్నారు. ఒక అసాధారణ స్థితిలోకి భారత్ ప్రస్తుతం చైనాను నెడుతోంది అని వ్యాఖ్యానించారు. యన్ సన్ చైనా ఇండియాపై ప్రతీకారం తీర్చుకుంటుందా ? లేక సరిహద్దుల్లో భూమి వదులుకుంటుందా అన్నది తేలాల్సి ఉందని పేర్కొన్నారు. యన్ సన్ వ్యాఖ్యల ప్రకారం చైనా మూడేళ్ల నుండి ఇండియా టార్గెట్ పెట్టిందని ప్రస్తుతం కొనసాగుతున్న ఘర్షణలకు బీజం మూడేళ్ల క్రితమే డోక్లాం వివాదం తో పడిందని అర్థమవుతుంది. ఏదిఏమైనా ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలు యుద్ధ సన్నాహాలలో బిజీగా ఉన్నాయి. సమరానికి సై అంటున్నాయి.

  English summary
  Speaking about the 2017 Doklam standoff between India and China, Yun Sun said, "During the Doklam standoff in 2017, China was surprised because it was not expecting India to stand up to it and to stage a 72-73 day long standoff over a piece of barren land near Bhutan."
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more