నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధ్బుతంగా పనిచేస్తోంది: మామ్‌ను మరో 6 నెలలు పొడిగించిన ఇస్రో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం అంగారకుడి కక్ష్యలో దిగ్విజయంగా ఆరు నెలలు పూర్తి చేసుకుంది. ప్రయోగం విజయవంతం కావడంతో, దీని జీవితకాలాన్ని మరో 6 నెలలు పాటు పొడిగించాలని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్రో) మంగళవారం నిర్ణయం తీసుకుంది.

మామ్ ఉపగ్రహంలో ఇంకా 37 కిలోల ఇందనం మిగిలి ఉందని ఇస్రో అధికార ప్రతినిధి దేవీ ప్రసాద్ కార్నిక్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మామ్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తోందన్నారు.

India's Mars Orbiter Mission Extended For Another 6 Months

అది మరో ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం మనుగడ సాగిస్తోందని తెలిపారు. గత ఏడాది మామ్ ఉపగ్రహం అంగాకరకుడి కక్ష్యలో ప్రయోగించినప్పుడు ఆరు నెలలు పాటు సేవలందిస్తుందని మొదట భావించారు.

అయితే ఇప్పుడు అది అంచనాలను మించి పని చేయడం సంతోషం కలిగించే విషయమని అన్నారు. ఇక మామ్‌ను 2013 నవంబర్ 5న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహారి కోట నుంచి పీఎస్ఎల్‌వీ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం గత ఏడాది సెప్టెంబర్ 24న అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

English summary
India's maiden Mars Orbiter mission was extended for another six months on Tuesday to further explore the Red Planet and its atmosphere, a senior official said here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X