రికార్డు స్ధాయికి భారత్ రక్షణ వ్యయం-ప్రపంచంలో మూడో స్ధానం-యూఎస్, చైనా తర్వాత మనమే
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద, అంతర్యుద్ధ, సాయుధ ముప్పు పెరుగుతూనే ఉంది. దానికి తగినట్లుగానే ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాలు కూడా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్న భారత్ రక్షణ వ్యయం హద్దులు దాటిపోతోంది. తాజాగా స్టాక్ హోమ్ కు చెందిన ఓ పరిశోధన సంస్ధ విడుదల చేసిన నివేదికలో భారత్ 2021లో పెట్టిన రక్షణ వ్యయం ప్రపంచంలోనే మూడో స్ధానంలో నిలిచింది.

భారత్ రక్షణ వ్యయం రికార్డు
భారత్ రక్షణ వ్యయం గత కొన్నేళ్లుగా పెరుగుతూనే ఉంది. పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ముప్పు కారణంగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏటికేడాది రక్షణ వ్యయాల్ని పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ముప్పుతో కేంద్రం తప్పనిసరిగా రక్షణ వ్యయం పెంచాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. అలాగే కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి పాకిస్తాన్ నుంచి ముప్పు తగ్గిపోయినట్లు చెప్పుకుంటున్నా క్షేత్రస్ధాయిలో విరుద్ధమైన పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దీంతో భారత్ రక్షణ వ్యయం గతేడాది కూడా భారీగా పెరిగింది.

ప్రపంచంలో మూడోస్ధానం
స్టాక్హోమ్
ఇంటర్నేషనల్
పీస్
రీసెర్చ్
ఇన్స్టిట్యూట్
(SIPRI)
ప్రకారం,
2021లో
భారతదేశ
రక్షణ
వ్యయం
ప్రపంచంలో
మూడవ
అత్యధికంగా
ఉంది.
భారతదేశ
సైనిక
వ్యయం
2021లో
$76.6
బిలియన్లుగా
నమోదైంది.
2020
నుంచి
చూస్తే
ఇది
0.9
శాతం
పెరిగింది.
అలాగే
2012
నుంచి
చూసుకుంటే
33
శాతం
పెరిగింది.
ఇది
ప్రపంచంలోనే
మూడో
స్ధానంగా
నమోదైంది.
దీంతో
ఇప్పుడు
భారత్
రక్షణ
వ్యయం
ప్రపంచ
దేశాలను
ఆలోచనలో
పడేస్తోంది.

యూఎస్, చైనా తర్వాత మనమే
భారత్ రక్షణ వ్యయం చూసుకుంటే ఇప్పుడు ప్రపంచ దేశాల జాబితాలో మూడో స్ధానంలో ఉంది. తొలి స్ధానంలో యూఎస్, రెండో స్ధానంలో చైనా ఉండగా.. ఆ తర్వాత మనమే ఉన్నాం. యూఎస్ సైనిక వ్యయం 2021లో 801 బిలియన్ డాలర్లకు చేరుకుంది, 2020 నుంచి చూస్తే ఇధి 1.4 శాతం తగ్గింది. మరోవైపు చైనా రక్షణ కోసం 293 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. 2020తో పోలిస్తే ఇది 4.7 శాతం పెరిగింది.

ఆల్ టైమ్ గరిష్టానికి ప్రపంచ రక్షణ వ్యయం
స్టాక్ హోమ్ నివేదిక ప్రకారం, 2021లో ప్రపంచ సైనిక వ్యయం 2.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని ఆల్ టైమ్ గరిష్ఠ రికార్డులు నమోదు చేసింది. 2021లో మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 0.7 శాతం పెరిగి 2113 బిలియన్ల యూస్ డాలర్లకు చేరుకుంది. 2021లో ఐదు అతిపెద్ద రక్షణ వ్యయదారులుగా యూఎస్, చైనా, భారత్, యూకే, రష్యా నిలిచాయి. ఈ ఐదు దేశాలు ప్రపంచ రక్షణ వ్యయంలో 62 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోవిడ్ ముప్పుతో ఆర్థిక వ్యవస్ధలు పతనమైనా ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలను తాకింది. ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ-కాల వృద్ధి రేటులో మందగమనం ఉంది. అయినా నామమాత్రంగా సైనిక వ్యయం 6.1 శాతం పెరిగింది.